హైదరాబాద్: క్యూన్యూస్ చానల్ యూట్యూబ్‌లో నిర్వహించిన ఓ పబ్లిక్ పోల్‌లో తన కొడుకు పేరును ప్రస్తావిస్తూ వ్యంగ్యంగా పోస్ట్ పెట్టడంపై మంత్రి కేటీఆర్ ఆవేదన చెందారు. ఇలాంటివి చూసినప్పుడే తాను ప్రజాజీవితంలో ఉండడం కరెక్టేనా? అని అనిపిస్తుందన్నారు.ఈ సోషల్‌మీడియా కాలంలో ఎవరు ఎవరిపైనానైనా ఎలాంటి రుజువులు లేకుండా నిస్సిగ్గుగా బురదజల్లుతున్నారని మండిపడ్డారు. జర్నలిజం ముసుగులో 24 గంటలు చెత్తను ప్రసారం చేసే యూట్యూబ్ చానళ్లలోకి తమ పిల్లలను లాగడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.
సోషల్‌మీడియా జర్నలిజం పేరిట భావవ్యక్తీకరణ స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. సామాజిక మాధ్యమాలు సంఘవిద్రోహ చర్యలకు అడ్డాగా మారాయని మండిపడ్డారు.
క్యూన్యూస్ పెట్టిన పబ్లిక్పోల్ను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ట్యాగ్ చేస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్ పెట్టారు. తెలంగాణలోని బీజేపీ నేతలకు మీరు నేర్పింది ఇదేనా? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.
బీజేపీ మౌత్‌పీస్ చానల్లో పెట్టిన రాజకీయ పోస్ట్‌లో నా కొడుకు పేరు ప్రస్తావిస్తూ బాడీ షేమింగ్ చేయడం మీరు నేర్పిన సంస్కారమేనా అంటూ చురకలంటించారు.. మీరు ఆలోచించలేదా? మేం కూడా అమిత్ షా లేదా మోడీ ఫ్యామిలీపై ఇలాంటి వ్యాఖ్యలు చేయగలమా? అని ప్రశ్నించారు. దయచేసి థర్డ్‌రేట్ నాయకులు, బీజేపీ మౌత్‌పీస్ మీడియాలు నా పిల్లలపై ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేయకండి అని హెచ్చరించారు. ఇదే పునరావృతమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, తాము కూడా ఇదేస్థాయిలో ప్రతిస్పందిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.
Sri @JPNadda Ji,
— KTR (@KTRTRS) December 24, 2021
Is this what you teach BJP leaders in Telangana? Is it Sanskar to drag my young son & body shame him through ugly political comments in BJP’s mouthpiece?
You don’t think we could reciprocate in the same coin against Amit Shah Ji’s or Modi Ji’s family? https://t.co/hHlXC99r1v