హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): కనీస వేతనాల సవరణ కోసం కొత్త చట్టం అమల్లోకి వచ్చాక కూడా పాత చట్టం ప్రకారం నోటిఫికేషన్లు జారీచేయడం చట్టబద్ధమేనా? అని హైకోర్టు ప్రభుత్వాన్ని నిలదీసింది.
ఈ అంశంపై పూర్తి వివరణతో అఫిడవిట్ దాఖలు చేయాలని సర్కార్కు నోటీసులు జారీచేసి, విచారణను 20కి వాయిదా వేసింది.