వాషింగ్టన్ : రాత్రిపూట ఎక్కువ సమయం కృత్రిమ కాంతి కింద గడిపే వ్యక్తులు గుండె జబ్బుల బారిన పడే ముప్పు ఎక్కువగా ఉందట! దీనికితోడు సామాజికంగా, పర్యావరణపరంగా అధిక ఒత్తిడితో కూడిన వాతావరణంలో ఉన్నట్టయితే గుండెజబ్బు ముప్పును పెంచుతుందని సైంటిస్టులు ప్రాథమికంగా తేల్చారు.
కృత్రిమ కాంతి లేదా కాంతి కాలుష్యానికి ఎక్కువ స్థాయిలో గురికావడం వల్ల మెదడులో ఒత్తిడి పెరిగి, ధమనుల వాపు, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుందని బోస్టన్ నగరంలో నిర్వహించిన అధ్యయనంలో తేలింది.