న్యూఢిల్లీ : భారత్లోని గూగుల్ క్రోమ్ యూజర్లకు హ్యాకర్ల నుంచి ముప్పు పొంచి ఉందని హై-రిస్క్ హెచ్చరిక జారీ అయ్యింది. డెస్క్టాప్ వెర్షన్లో తీవ్రమైన భద్రతా లోపాలు ఉన్నాయని, యూజర్ల వ్యక్తిగత డాటాను హ్యాకర్లు సులభంగా దొంగలించే ప్రమాదముందని ‘సెర్ట్-ఇన్'(ఇండియన్ కంప్యూటర్ ఎమెర్జెన్సీ రెస్పాన్స్ టీమ్) పేర్కొంది.
విండోస్, మ్యాక్, లైనక్స్ వినియోగదారులు వెంటనే తమ గూగుల్ క్రోమ్ వెర్షన్ను అప్డేట్ చేసుకోవాలని సూచించింది.