శ్రీకరణ్, అనూష, షన్ను హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘తారకేశ్వరి’. వెంకట్రెడ్డి నంది స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 7న విడుదల కానున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్లో ప్రీరిలీజ్ వేడుక నిర్వహించారు. సకుటుంబంగా చూడదగ్గ సినిమా ఇదని దర్శక,నిర్మాత వెంకట్రెడ్డి నంది తెలిపారు.
ఈ సినిమాలో భాగం అవ్వడం పట్ల హీరోహీరోయిన్లు ఆనందం వెలిబుచ్చారు. ఇంకా యూనిట్ సభ్యులతోపాటు అన్విక ఆడియో అధినేత సంజీవ్ మేగోటి, నటులు కుప్పిలి శ్రీనివాస్, ఘర్షణ శ్రీనివాస్ కూడా మాట్లాడారు.