‘ప్రభాస్, దుల్కర్ సల్మాన్, రానా, సందీప్ కిషన్, యూవీ క్రియేషన్స్ అధినేతలు వంశీ, ప్రమోద్.. వీరంతా మా సినిమా విజయం సాధించాలని శుభాకాంక్షలు అందించారు. కొండంత మోరల్ సపోర్ట్ ఇచ్చారు. వారందరికీ కృజ్ఞతలు తెలుపుతున్నా. అందరినీ ఆకట్టుకునే కంటెంట్ ఇది. దర్శకుడు యుగంధర్ ఈ సినిమాను అద్భుతంగా తీశారు. ఎవ్వరినీ ఈ సినిమా నిరాశపరచదు.’
అని హీరో ఆది సాయికుమార్ నమ్మకంగా చెప్పారు. ఆయన కథానాయకుడిగా నటించిన సూపర్ నాచురల్ థ్రిల్లర్ ‘శంబాల’. ‘ఎ మిస్టికల్ వరల్డ్’ ఉపశీర్షిక. యుగంధర్ ముని దర్శకుడు. రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్‌రెడ్డి నిర్మాతలు.
డిసెంబర్ 25న సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆది సాయికుమార్ మాట్లాడారు. ప్రచార చిత్రాలకు అద్భుతమైన స్పందన వచ్చిందని, సాంకేతికంగా గొప్పగా ఈ సినిమా ఉంటుందని దర్శకుడు యుగంధర్ తెలిపారు. ఈ సినిమాలో భాగం అవ్వడం పట్ల కథానాయిక అర్చన అయ్యర్ ఆనందం వెలిబుచ్చారు. ఇంకా నటులు రవివర్మ, ఇంద్రనీల్, మధునందన్ కూడా మాట్లాడారు.