వేసవిలో వ్యాయామం..
భానుడు భగభగ మండుతున్నాడు. ఉదయం 9 గంటల నుంచే ప్రతాపం చూపిస్తున్నాడు. ఇక వ్యాయామం చేసేవారికైతే.. ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. ఈ క్రమంలో రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసేవాళ్లు.. వేసవిలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
భానుడు భగభగ మండుతున్నాడు. ఉదయం 9 గంటల నుంచే ప్రతాపం చూపిస్తున్నాడు. ఇక వ్యాయామం చేసేవారికైతే.. ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. ఈ క్రమంలో రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసేవాళ్లు.. వేసవిలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. లేకుంటే.. తీవ్రమైన ఇబ్బందులు పడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
- ఉదయం 8 గంటలలోపే వ్యాయామం పూర్తయ్యేలా చూసుకోవాలి. ముఖ్యంగా జాగింగ్ చేసేవాళ్లు మరింత ముందే ఇంటికి తిరుగుముఖం పట్టాలి. సాయంత్రమైతే.. 6 గంటల తర్వాతే మొదలుపెట్టాలి.
- మైదానాల్లో కాకుండా.. చెట్లు ఎక్కువగా ఉండే పార్కుల్లో వ్యాయామం చేయడం మంచిది.
- ముదురు రంగులు కాకుండా.. తేలికపాటి, లేతరంగు దుస్తులతోపాటు తలకు టోపీ తప్పకుండా ధరించాలి.
- వేసవిలో అతిగా వ్యాయామం చేయకపోవడమే మంచిది. ఈకాలంలో శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వడం చాలా ముఖ్యం.
- రోజూ గంట వ్యాయామం చేసేవాళ్లు.. వేసవిలో 45 నిమిషాలు చేస్తే సరిపోతుంది.
- ఖాళీ కడుపుతో వ్యాయామం చేయడం.. ఆరోగ్యానికి చేటు చేస్తుంది. కాబట్టి, వ్యాయామానికి వెళ్లేముందు, వచ్చిన తర్వాత కూడా తగినంత పోషకాహారం తీసుకోవాలి. సహజ ప్రొటీన్ వనరులకు ప్రాధాన్యం ఇవ్వాలి. శరీరం హైడ్రేటెడ్గా ఉండేలా చూసుకోవాలి.
- వేసవిలో చెమట వల్ల శరీరం ఎక్కువగా నీటిని కోల్పోతుంది. దాంతో.. వేగంగా డీహైడ్రేషన్కు గురవుతుంది. కాబట్టి, వ్యాయామం చేసేటప్పుడు మధ్యమధ్యలో తగినన్ని నీళ్లు తీసుకుంటే మంచిది. అలాగే ఎలక్ట్రోలైట్స్ అధికంగా ఉండే అరటిపండ్లు, నారింజ, అవకాడో తింటే మేలు.
- వేడివల్ల అలసట, వడదెబ్బ లాంటి ప్రమాదాలను ముందుగానే అర్థం చేసుకోవాలి. అధిక చెమట, బలహీనత, తల తిరగడం, వికారంతోపాటు తలనొప్పి లాంటి లక్షణాలు కనిపిస్తే.. వెంటనే వ్యాయామం నిలిపేయాలి.
- ఇక జిమ్లో వ్యాయామం చేసేటప్పుడు ఛాతీనొప్పి, తలతిరగడం, ఊపిరి ఆడకపోవడం, గుండె వేగంగా కొట్టుకోవడం లాంటి లక్షణాలు కనిపించినా.. వ్యాయామాన్ని ఆపేయాలి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

