చండీగఢ్, అక్టోబర్ 10: ఎన్నికల్లో పోటీచేసేవారు సాధారణంగా ఉచిత హామీలు ఇస్తుంటారు. అయితే, హర్యానాలోని సిర్సాద్ గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థి జైకరణ్ లాత్వాల్.. గ్రామస్తులు కలలో కూడా ఊహించిన హామీలు ఇచ్చాడు. తనను గెలిపిస్తే ఊరిలో మూడు ఎయిర్‌పోర్టులు నిర్మిస్తానని, ఇంటింటికీ బైక్, మహిళలకు మేకప్ కిట్స్తోపాటు జీఎస్టీ లేకుండా చేస్తానని పోస్టర్లు వేశాడు. అలాగే, పెట్రోల్ రేటును రూ. 20, గ్యాస్ సిలిండర్ ధరను రూ.100కు తగ్గిస్తానని హామీల వర్షం కురిపించాడు.
ఇంటింటికీ ఉచిత వైఫైతోపాటు మద్యం అలవాటున్నవారికి రోజు ఒక బాటిల్ ఆల్కాహాల్ ఫ్రీగా అందిస్తానని చెప్పాడు. సిర్సాద్ గ్రామం నుంచి ఢిల్లీకి మెట్రో కనెక్షన్‌తోపాటు గ్రామం నుంచి పక్కనే ఉన్న పట్టణానికి ప్రతి ఐదు నిమిషాలకో హెలికాప్టర్‌ను ఏర్పాటు చేస్తానని హామీలు గుప్పించాడు. ఈ పోస్టర్‌ను ఐపీఎస్ అధికారి అరుణ్ బోత్రా ట్విటర్లో షేర్ చేయగా, వైరల్‌గా మారింది. తామంతా వెంటనే సిర్సాద్ గ్రామానికి మారిపోతామంటూ నెటిజన్లు కామెంట్ చేశారు.