హుజూరాబాద్ : మాకు కేసీఆర్ సార్ ఇచ్చిన దళితబంధు పదిలక్షలతో హర్యానాకు పోయి నాలుగు బర్లను తెచ్చుకుని వాటిని పోషించుకుంటున్నం. కేసీఆర్ సార్ మాకు దేవుడు. మాది చాలా పేద కుటుంబం. కూలీపనిచేసుకుంటేనే తింటం. ఈ బర్లను కాపాడుకుంట బతుకుతం. నాకు ముగ్గురు ఆడపిల్లలు. మా పెద్దమ్మాయి పెండ్లికి కల్యాణలక్ష్మి వచ్చింది. దళితబంధుతో మమ్మల్ని ఆదుకున్న కేసీఆర్ సార్ మా పాలిట దేవుడు.
– కొత్తూరి రాధ, కనుకుల గిద్దె, హుజూరాబాద్ మండలం