Harshwanti Bisht | హర్షవంతి బిస్త్.. పర్వతారోహకురాలు, పర్యావరణవేత్త కూడా. 1984లోనే ఎవరెస్ట్‌ను అధిరోహించి వార్తల్లో నిలిచారు. ఆ సమయంలో తనను ప్రోత్సహించిన ఇండియన్ మౌంటెనీరింగ్ ఫౌండేషన్ (ఐఎమ్ఎఫ్) కే నేడు అధ్యక్షురాలు అయ్యారు. అదీ అరవై రెండేండ్ల వయసులో.
హర్షవంతి బిస్త్ సొంతూరు ఉత్తర కాశీ. పర్వతారోహణ అంటే ప్రాణం. అర్థశాస్త్రంలో ఎంఏ తర్వాత, నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్‌లో శిక్షణ తీసుకున్నారు. 1981లో మొదటిసారిగా నందాదేవి పర్వత శిఖరాన్ని అధిరోహించిన మొదటి ముగ్గురు మహిళల్లో బిస్త్ ఒకరు. అదే సంవత్సరం ‘అర్జున’ పురస్కారం వరించింది. తర్వాత ఎవరెస్ట్నూ ఎక్కారు. పర్యావరణం మీద ప్రేమతో.. గంగానది సంరక్షణ కోసం ‘సేవ్ గంగోత్రి ప్రాజెక్ట్’ను స్థాపించారు. హిమాలయ ప్రాంతంలో అంతరించిపోతున్న అరుదైన భోజ్పత్ర చెట్లను సంరక్షించడానికి పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. ఆ పోరాటానికి గుర్తింపుగా ‘ఎడ్మండ్ హిల్లరీ మౌంటెయిన్ లెగసీ’ మెడల్ అందుకున్నారు. అరవై రెండేండ్ల వయసులో.. ఐఎమ్ఎఫ్కు మొదటి మహిళా అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించారు. దేశంలో పర్వతారోహణ చేపట్టే అత్యున్నత సంస్థ ఇది. ‘మరింతమంది అమ్మాయిలను పర్వతారోహణ దిశగా ప్రోత్సహించడమే నా తక్షణ కర్తవ్యం’ అంటున్నారు హర్షవంతి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఎక్కడ మైక్ పెట్టినా హలో హలో మైక్ టెస్టింగ్ అంటుండె.. అది చూసి పాట పాడిస్తుండె
వజ్రాల వ్యాపారం చేస్తున్న ఏకైక మహిళ రాధిక మన్నె.. ఎవరామె.. ఆమె సక్సెస్ సీక్రెట్ ఏంటి?
custard apple | సీతాఫలాలతో ఐస్‌క్రీమ్‌లు తయారు చేస్తున్న పాలమూరు మహిళలు..
jai bhim | ఈమెదీ చినతల్లి లాంటి కథే.. కానీ న్యాయం ఇంకా జరగలేదు !