కరోనా టీకా రెండో డోస్ తీసుకున్న కేంద్రమంత్రి హర్షవర్ధన్
హర్షవర్ధన్ | కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ మంగళవారం కొవిడ్ టీకా రెండో డోసు తీసుకున్నారు.

న్యూఢిల్లీ : కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ మంగళవారం కొవిడ్ టీకా రెండో డోసు తీసుకున్నారు. సతీమణి నూతన్ గోయల్‌తో కలిసి ఢిల్లీలోని హార్ట్ అండ్ లంగ్ ఇనిస్టిట్యూట్‌లో దేశీయంగా అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా వేయించుకున్నారు. ఇంతకు ముందు ఈ నెల 2న వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారు. మళ్లీ 28 తర్వాత ఆయన మంగళవారం రెండో డోసు తీసుకున్నారు. కొవాగ్జిన్ టీకాను హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ కంపెనీ అభివృద్ధి చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్న తర్వాత తమకు ఎలాంటి దుష్ప్రభావాలు కలుగలేదన్నారు.
రెండు భారతీయ టీకాలు సురక్షితం, ప్రభావంతమైనవని స్పష్టంచేశారు. టీకాలపై ఇప్పటికీ చాలా మందిలో సందేహాలు ఉన్నాయని, సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని సూచించారు. ప్రతి ఒక్కరూ టీకాలు తీసుకోవాలని కోరారు. టీకాలు తీసుకున్న వారిలో కొందరికి సైడ్ ఎఫెక్ట్స్ అరుదైన సందర్భాలు మాత్రమేనని.. టీకాలు తీసుకున్న తర్వాత కరోనా సోకే, ఆసుపత్రుల్లో చేర్పించే అవకాశాలను తగ్గిస్తుందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. దేశంలో జనవరి 16న ప్రారంభించిన వ్యాక్సిన్ డ్రైవ్ నుంచి ఇప్పటి వరకు దేశంలో 6,11,13,354 డోసులు వేసినట్లు మంత్రిత్వశాఖ తెలిపింది.

ఇవి కూడా చదవండి..
దారుణం.. బావిలో ఐదుగురి దుర్మరణం
పున్నమి చంద్రుడే ఆ నౌకను కదిలించాడు.. !
దేశంలో కొత్తగా 56,211 కరోనా కేసులు
ఫరూక్ అబ్దుల్లాకు కరోనా పాజిటివ్
భారత మహిళా క్రికెటర్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు కరోనా పాజిటివ్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Five Of A Family Found Dead | తల్లి, భార్య, ఇద్దరు పిల్లలను చంపి.. రైలు ముందు దూకి వ్యక్తి ఆత్మహత్య
Stock Markets | భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. ఏకంగా రూ.7 లక్షల కోట్లు పెరిగిన మదుపర్ల సంపద..!
Sailesh Kolanu | తుఫాను బాధితులకు అండగా శైలేష్ కొలను.. క్షేత్రస్థాయిలో సహాయక చర్యలు, నెటిజన్ల ప్రశంసలు!
ISRO Jobs | ఇస్రోలో 61 టెక్నీషియన్-బి, డ్రైవర్ పోస్టులు.. నవంబర్ 13 చివరితేదీ
‘కోతుల బెడదకు శాశ్వత పరిష్కారం చూపాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

