దారుణం.. బావిలో ఐదుగురి దుర్మరణం
ఐదుగురి దుర్మరణం | మేఘాలయలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పశ్చిమ జయంతి హిల్స్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న బావిలో ప్రమాదవశాత్తు ఐదుగురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు.

షిల్లాంగ్ : మేఘాలయలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పశ్చిమ జయంతి హిల్స్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న బావిలో ప్రమాదవశాత్తు ఐదుగురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. జోవాయి పట్టణ శివార్లలోని మిహ్మింట్డు గ్రామంలో బావి నిర్మిస్తున్న సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న ప్రత్యేక రెస్క్యూ బృందం సంఘటనా స్థలానికి చేరుకొని మరో ఇద్దరిని రక్షించింది. రెస్క్యూ బృందం 35 మీటర్ల లోతులో ఉన్న బావిలో నుంచి వివిధ చోట్ల పడి ఉన్న ఐదుగురి మృతదేహాలను వెలికి తీసినట్లు ఫైర్ సర్వీస్ ఎస్సీ గొయెంకా తెలిపారు. కార్మికులు నీటిని తోడేందుకు వినియోగిస్తున్న పైపు నుంచి పొగరావడంతో అపస్మారక స్థితిలోకి చేరుకున్నారని పేర్కొన్నారు. ప్రమాదం నుంచి బయటపడిన కార్మికులు చికిత్స పొందుతున్నారని వివరించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
నాగార్జున సాగర్‌లో బీజేపీ చతికిల!
పగలు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు..
నిప్పులకుంపటి.. రాష్ట్రంలో 43 డిగ్రీలకు చేరిన ఎండ
హోలీ ఆడనివ్వలేదని అవ్వను చంపేశారు
ఆధార్ లింక్ లేకపోతే పాన్‌కార్డు చెల్లదు!
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bengaluru Techie’s Kidnap | టెక్కీ కిడ్నాప్ కేసులో 11 మంది అరెస్ట్.. అతడు అత్యాచారానికి పాల్పడినట్లు కిడ్నాపర్ మహిళ ఫిర్యాదు
Tirumala | తిరుమలలో నీటి ఎద్దడి రాకుండా పటిష్ట చర్యలు.. 150 రోజులకు సరిపడా నీటి నిల్వలు : టీటీడీ
Water Tanker | హైదరాబాద్ రోడ్లపై.. వాటర్ ట్యాంకర్లో నుంచి వృధాగా పోతున్న నీళ్లు.. వీడియో
Case Register | రైస్‌మిల్‌లో రూ.13.77 కోట్ల సీఎంఆర్ ధాన్యం మాయం.. మిల్లు భాగస్వాములపై కేసు నమోదు
Premayanam | ఓటీటీలో అదరగొడుతున్న ‘ప్రేమాయణం’ వెబ్ సిరీస్.. ఆకట్టుకుంటున్న బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

