IND vs ENG : ఓవల్ టెస్టులో గెలుపొంది సిరీస్ సమం చేయాలనుకున్న భారత జట్టు ఆశలు సన్నగిల్లుతున్నాయి. బౌలర్లు తేలిపోతుండడంతో ఇంగ్లండ్ విజయానికి చేరువవుతోంది. టాపార్డర్‌ను త్వరగానే ఔట్ చేసినా మిడిలార్డర్లో హ్యారీ బ్రూక్ (59 నాటౌట్) అర్ధ శతకంతో మెరిశాడు. జో రూట్ (37 నాటౌట్) సైతం కీలక ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. ఈ ఇద్దరూ ఇప్పటికే నాలుగో వికెట్‌కు 92 రన్స్ జోడించారు. దాంతో, ఇంగ్లండ్ జట్టు లక్ష్యానికి చేరువవుతోంది. ప్రస్తుతం ఆతిథ్య జట్టు స్కోర్… 199/3. ఇంకా పోప్ సేన విజయానికి 174 రన్స్ కావాలంతే.
సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే ఓవల్ టెస్టులో ఇంగ్లండ్ బ్యాటర్లు గొప్పగా పోరాడుతున్నారు. భారత జట్టు నిర్దేశించిన 375 పరుగుల ఛేదనలో ఆతిత్య జట్టు ఆటగాళ్లు అద్భుతంగా ఆడుతున్నారు. మూడో రోజు ఓపెనర్ జాక్ క్రాలే(14) ఔటైనా.. ఆ ప్రభావం జట్టుపై పడకుండా చూసుకున్నారు బెన్ డకెట్(54), ఓలీ పోప్(27)లు. నాలుగో రోజు ఈ ఇద్దరూ భారత బౌలర్లను ఉతికేస్తే లక్ష్యాన్ని కరిగించారు. అయితే.. అర్ధ శతకంతో విరుచుకుపడిన డకెట్‌ను ప్రసిధ్ వెనక్కి పంపగా.. కాసేపటికే పోప్ ఇన్నింగ్స్‌కు సిరాజ్ తెరదించాడు.
Brook continues to attack after lunch, reaching a 39-ball fifty to take the target under 200 💪https://t.co/rrZF1qeH0S #ENGvIND pic.twitter.com/iiBTThSAws
— ESPNcricinfo (@ESPNcricinfo) August 3, 2025