Tourist Family Director | టూరిస్ట్ ఫ్యామిలీ (Tourist Family) అంటూ వచ్చి మొదటి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నాడు దర్శకుడు అభిషన్ జీవింత్(Abishan Jeevinth). శశి కుమార్, సిమ్రాన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ చిత్రం తమిళంలో రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమా తర్వాత అభిషన్ మరో సినిమాను తెరకెక్కిస్తాడు అనుకుంటే హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఆయన హీరోగా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ వినాయక చవితి కానుకగా లాంఛ్ అయ్యింది. ఈ సినిమాలో మలయాళం నటి అనస్వర రాజన్ (Anaswara Rajan) కథానాయికగా నటిస్తుండగా.. మదన్ దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ సినిమాను రజనీకాంత్ కూతురు సౌందర్య రజనీకాంత్ నిర్మించబోతుంది. తాజాగా ఈ ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాలు నేడు జరుగగా.. ఈ వేడుకకు టూరిస్ట్ ఫ్యామిలీ చిత్రబృందం వచ్చి సందడి చేసింది.
With hearts full of gratitude, we joyfully mark the successful completion of the pooja ceremony for our production no #4
proudly presented by Zion Films and MRP Entertainment.
📸 We are delighted to share a few glimpses from our pooja ceremony, capturing the spirit of hope,… pic.twitter.com/KLe4KUOKrg— soundarya rajnikanth (@soundaryaarajni) August 28, 2025