WPL 2024 : మహిళల ప్రీమియర్ లీగ్(WPL) రెండో సీజన్ మరో వారం రోజుల్లో షురూ కానుంది. ఫిబ్రవరి 23న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో డబ్ల్యూపీఎల్ ఆరంభ వేడుకలు, అనంతరం తొలి మ్యాచ్ జరుగనుంది. మెగా టోర్నీకి 7 రోజులే ఉండడంతో అన్ని జట్లు ప్రాక్టీస్ వేగం పెంచాయి. నిరుడు ముంబై ఇండియన్స్(Mumbai Indians)ను చాంపియన్‌గా నిలబెట్టిన హర్మన్‌ప్రీత్ కౌర్(Harmanpreet Kaur) మెగా టోర్నీకి కసరత్తులు ప్రారంభించింది. ఈ ముంబై కెప్టెన్ నెట్స్‌లో చెమటోడ్చుతోంది.
ఆమె నెట్స్‌లో బ్యాటింగ్ సాధన చేస్తున్న ఫొటోను ముంబై ఫ్రాంచైజీ ఎక్స్ ఖాతాలో పెట్టింది. తొలి సీజన్లో కెప్టెన్‌గా, బ్యాటర్‌గా సత్తా చాటిన హర్మన్‌ప్రీత్ 10 మ్యాచుల్లో 281 రన్స్ కొట్టింది. అందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
𝐇𝐚𝐧𝐠 𝐢𝐭 𝐢𝐧 𝐭𝐡𝐞 𝐋𝐨𝐮𝐯𝐫𝐞 ft. Harman 🖼️🤌#OneFamily #AaliRe #MumbaiIndians #TATAWPL pic.twitter.com/GIraue7tRy
— Mumbai Indians (@mipaltan) February 15, 2024
గత సీజన్లో మ్యాచ్‌లు అన్నీ ముంబైలో జరగగా ఈ సీజన్లో మాత్రం బెంగళూరు, ఢిల్లీ ఆతిథ్యమివ్వనున్నాయి. 20 లీగ్ మ్యాచ్‌లు, రెండు నాకౌట్ మ్యాచ్‌లు (మొత్తం 22)గా సాగే ఈ టోర్నీలో.. తొలి 11 మ్యాచ్‌లు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతాయి. రెండో సీజన్ ఆరంభ మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగనుంది. ఈ సీజన్లో ప్రతి రోజూ ఒక్క మ్యాచ్ మాత్రమే నిర్వహించనున్నారు.
తొలి సీజన్ ట్రోఫీతో హర్మన్‌ప్రీత్ కౌర్
నిరుడు ముంబై వేదికగా జరిగిన ఈ టోర్నీలో.. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు టైటిలో కోసం పోటీ పడ్డాయి. లీగ్ దశ నుంచి అదరగొట్టిన ముంబై, ఢిల్లీ టైటిల్ పోరులో తలపడ్డాయి. అయితే.. ఏకపక్షంగా సాగిన ఫైనల్లో హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని ముంబై చాంపియిన్‌గా అవతరించింది.