Zainab Ali Naqvi : పాకిస్థాన్ టెన్నిస్ సంచలనం జైనబ్ అలీ నఖ్వీ(Zainab Ali Naqvi) గుండెపోటుతో మృతి చెందింది. సోమవారం ఆమె తన సొంత ఇంట్లోనే మరణించినట్టు డాక్టర్లు చెప్పారు. 23 ఏండ్ల జైనబ్ ఐటీఎఫ్(ITF) టోర్నమెంట్ కోసం ఇస్లామాబాద్‌లోని తమ ఇంటి వద్దనే సిద్ధమవుతోంది. సోమవారం ప్రాక్టీస్ అనంతరం స్నానం చేయడానికి బాత్రూమ్కి వెళ్లింది. అక్కడే జైనబ్‌కు ఛాతీలో నొప్పి వచ్చింది. దాంతో, ఆమె అక్కడే కుప్పకూలిపోయింది.
ఈ విషయం తెలిసిన కుటుంబసభ్యులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ, అప్పటికే జైనబ్ గుండెపోటుతో మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. దాంతో, టెన్నిస్‌లో ఉన్నత శిఖరాలు అధిరోహించాలనుకున్న జైనబ్ జీవితం విషాదంగా ముగిసింది.
🚨JUST IN: Zainab Ali Naqvi, tennis player from #Karachi, passed away in #Islamabad.
The 23-year-old was in the capital for an #ITF tournament.
As per sources, Zainab went to take a bath after a match and was later found lifeless. #SamaaTV @HuzaifaKhan021… pic.twitter.com/u67w1T4niv
— SAMAA TV (@SAMAATV) February 13, 2024
ఆమె మరణవార్త తెలియగానే బంధువులు, స్నేహితులతో పాటు క్రీడాభిమానులు కన్నీరుమున్నీరయ్యారు. టెన్నిస్‌లో ఉజ్వల భవిష్యత్ ఉన్న జైనబ్ అకాల మరణంతో పాక్ టెన్నిస్ సమాఖ్య దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. త్వరలో ఇస్లామాబాద్‌లో జరిగే ఐటీఎఫ్ 30 టోర్నమెంట్‌కు జైనబ్ పేరు పెట్టాలని నిర్ణయించింది.
PTF President Aisam-ul-Haq has announced that the ITF J30 in Islamabad next week will be called the Zainab Ali Naqvi Memorial in order to honour the 17-year-old tennis player who passed away today due to a cardiac arrest. A court will also be named after her.
Gone too soon 💔 pic.twitter.com/Qb5QkVvw8M
— Muneeb Farrukh (@Muneeb313_) February 13, 2024
టెన్నిస్ ప్లేయర్ అయిన తండ్రిని చూస్తూ పెరిగిన జైనబ్ ఆరేండ్ల వయసులోనే రాకెట్ పట్టింది. హార్డ్ కోర్ట్‌లో ఆడడమంటే ఆమెకు ఎంతో ఇష్టం. జూనియర్ స్థాయిలో జైనబ్ ఎక్కువగా సింగిల్స్ మాత్రమే ఆడింది. పలు జాతీయ, అంతర్జాతీయ టోర్నీలో పాల్గొన్న ఆమె.. ఏటీఎఫ్ అండర్ -14 సూపర్ సిరీస్ టెన్నిస్ చాంపియన్‌షిప్స్ ట్రోఫీ గెలిచింది. ఫైనల్లో భారత్‌కు చెందిన వర్షా దాస్(Varsha Das)ను ఓడించింది. ఆ రోజుతో జైనబ్ పేరు పాకిస్థాన్‌లో మార్మోగిపోయింది. 2022లోనూ ఆమె పాక్ తరఫున జూనియర్ టెన్నిస్ చాంపియన్‌షిప్స్‌లో ఆడింది. అంతేకాదు నిరుడు పాకిస్థాన్ ఎయిర్‌ఫోర్స్‌తో ఒప్పందం చేసుకొని బలూచిస్థాన్‌లో జరిగిన నేషనల్ గేమ్స్‌లో పాల్గొంది.