Nuclear Weapons: అంతరిక్షంలో రష్యా అణ్వాయుధాలు.. అమెరికా ఆందోళన
nuclear weapons: అంతరిక్షంలో అణ్వాయుధాలను మోహరించేందుకు రష్యా ప్లాన్ చేస్తున్నట్లు అమెరికా పేర్కొన్నది. జాతీయ భద్రతకు ఇది తీవ్ర విఘాతంగా మారే అవకాశాలు ఉన్నట్లు అమెరికా తెలిపింది. న్యూ యార్క్ టైమ్స్‌లో దీనికి సంబంధించిన కథనం వచ్చింది.
న్యూయార్క్: అంతరిక్షంలో అణ్వాయుధాల(nuclear weapons)ను మోహరించేందుకు రష్యా ప్లాన్ చేస్తున్నట్లు అమెరికా పేర్కొన్నది. జాతీయ భద్రతకు ఇది తీవ్ర విఘాతంగా మారే అవకాశాలు ఉన్నట్లు అమెరికా తెలిపింది. న్యూ యార్క్ టైమ్స్‌లో దీనికి సంబంధించిన కథనం వచ్చింది. అమెరికా శాటిలైట్ వ్యవస్థను రష్యా అంతరిక్ష అణ్వాయుధం ప్రమాదంలో నెట్టివేస్తుందని ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై ఇంటెలిజెన్స్ అధికారులు నివేదికను తయారుచేశారు. అయితే ప్రస్తుత దశలో అంతరిక్ష ఆయుధాన్ని ఢీకొనే వ్యవస్థ తమ వద్ద లేదని అమెరికా అంటోంది.
రష్యా ఆయుధం వల్ల అంతరిక్షంలోని కమ్యూనికేషన్, నిఘా వ్యవస్థ ధ్వంసం అయ్యే అవకాశాలు ఉన్నట్లు రిపోర్టులో తెలిపారు. 1967లో కుదిరిన ఒటర్ స్పేస్ ట్రీటీని రష్యా ఉల్లంఘిస్తుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ ఒప్పందం ప్రకారం అన్ని రకాల అంతరిక్ష అణ్వాయుధాలపై నిషేధం ఉన్నది. నిజానికి అంతరిక్షంలో అణ్వాయుధాన్ని రష్యా మోహరిస్తుందో లేదో తెలియదు. కానీ అమెరికా ఇంటెలిజెన్స్ అధికారులు మాత్రం అధ్యక్షుడు బైడెన్‌కు రిపోర్టును చేరవేశారు. అయితే రష్యా ఆయుధం గురించి పూర్తి సమాచారాన్ని కాంగ్రెస్ సభ్యులకు తెలియజేయాలన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

