హయత్‌నగర్, అక్టోబర్ 12 : హయత్‌నగర్ దసరా గుడి ప్రాంగణంలో బొడ్రాయి విగ్రహ ప్రతిష్ఠ ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం మాజీ మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలంతా ఐకమత్యంతో బొడ్రాయి ప్రతిష్ఠించడం అభినందనీయమన్నారు.
ప్రతి ఊరికి ఒక బొడ్రాయి అనేది తెలంగాణ ప్రాచీన సంప్రదాయమన్నామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర కళ్లెం నవజీవన్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్ సామ తిరుమలరెడ్డి, కొప్పుల విఠల్‌రెడ్డి, జిట్టా రాజశేఖర్‌రెడ్డి, సాగర్‌రెడ్డి, నాయకులు భాస్కర సాగర్, మల్లీశ్వరి రెడ్డి, జక్కిడి రఘువీర్‌రెడ్డి, స్కైలాబ్, పారంద రమేశ్, సాయి, చంటి తదితరులు పాల్గొన్నారు.