నవీపేట్, అక్టోబర్ 12: రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నది. నవీపేట్ మీదుగా మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యం వాహనాన్ని ఆదివారం స్థానిక పోలీసులు పట్టుకున్నారు. నిజామాబాద్ నుంచి నవీపేట్ మీదుగా మహారాష్ట్రకు పీడీఎస్ బియ్యాన్ని టాటా ఏస్ వాహనంలో తరలిస్తున్నట్లు నవీపేట్ ఎస్సై తిరుపతికి సమాచారం అందింది. దీంతో ఆయన వాహనాలు తనిఖీ చేపట్టి అక్రమంగా బియ్యం తరలిస్తున్న వాహనాన్ని పట్టుకొన్నారు.
వాహనంలో 12.50 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం ఉన్నట్లు నవీపేట్ తహసీల్దార్ వెంకట రమణ నిర్ధారించారు. పంచనామా కోసం ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు సమాచారం అందించారు. వాహన డ్రైవర్ అసద్‌ను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై తిరుపతి తెలిపారు.