Harbhajan Singh | దివ్యాంగులను అవమానించలేదు.. నన్ను క్షమించండి
Harbhajan Singh : భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ (Harbhajan Singh) దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాడు. వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) లీగ్ ఫైనల్లో ఇండియా చాంపియన్స్ (India Champions) విజయం తర్వాత భజ్జీ పోస్ట్ చేసిన ఇన్‌స్టా రీల్‌పై విమర్శలు వచ్చాయి.
Harbhajan Singh : భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ (Harbhajan Singh) దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాడు. ‘తౌబా.. తౌబా’ పేరుతో తాను పెట్టిన ఇన్స్టాగ్రామ్ రీల్లో దివ్యాంగులను అవమానపరచలేదని, తనకు అందరి పట్ల గౌరవం ఉందని భజ్జీ వివరణ ఇచ్చాడు. అసలేం జరిగిందంటే.. ?
ఆదివారం జరిగిన వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) లీగ్ ఫైనల్లో ఇండియా చాంపియన్స్ (India Champions) జట్టు పాకిస్థాన్ చాంపియన్స్‌పై విజయం సాధించింది. ట్రోఫీ అందుకున్న అనంతరం కెప్టెన్ యువరాజ్ సింగ్, సురేశ్ రైనాలతో కలిసి హర్భజన్ విక్టరీ సెలబ్రేషన్ చేసుకున్నాడు. అంతటితో ఆగకుండా దివ్యాంగుల మాదిరిగా నడుస్తూ ‘తౌబా.. తౌబా’ అనే రీల్ చేసి ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. అయితే.. ఈ వీడియో కాస్త మిస్ ఫైర్ అయింది. పారా అథ్లెట్ మానసి జోషి (Manasi Joshi) ‘దివ్యాంగులంటే మీకు అంత చులకనా?’ అంటూ మండిపడింది.
‘స్టార్లు అయిన మీరు మరింత బాధ్యతగా ఉండాలి. దయచేసి దివ్యాంగులను అనుకరించకండి. అదేమీ నవ్వుకునే వ్యవహారం కాదు’ అని భజ్జీపై విమర్శలు గుప్పించింది. దాంతో, తన పోస్ట్‌ను చాలామంది తప్పుగా అర్థం చేసుకున్నారన్న హర్భజన్ ఎక్స్ వేదికగా అందరికీ ‘సారీ’ చెప్పాడు.
— Harbhajan Turbanator (@harbhajan_singh) July 15, 2024
‘సోషల్ మీడియాలో మా ‘తౌబా – తౌబా’ సెలబ్రేషన్ గురించి ఫిర్యాదు చేస్తున్న ప్రతి ఒక్కరికీ ఒక్కటి చెప్పాలనుకుంటున్నా. 15 రోజులు విరామం లేకుండా క్రికెట్ ఆడాక మా శరీరం తీరు ఎలా ఉంటుంది? ఒళ్లు నొప్పులు ఎలా ఉంటాయో చెప్పడానికే ఆ రీల్ చేశాం. అంతేతప్ప ఏ ఒక్కరినీ బాధ పెట్టడం, అవమానపరచడం మా ఉద్దేశం కాదు. అయినా మేము తప్పు చేశామని ప్రజలు అనుకుంటే నా తరఫున అందరికీ సారీ చెప్తున్నా. దయచేసి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేసి మందుకెళ్ధాం. అందరూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండండి. మీ అందరికీ నా ప్రేమ తెలియజేస్తున్నా’ అంటూ హర్భజన్ పెద్ద వివరణే ఇచ్చుకున్నాడు.
రాయుడు ఉతికేయగా…
వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ లీగ్‌లో భారత చాంపియన్స్ (India Champions) జట్టు విజేతగా నిలిచింది. తెలుగు ఆటగాడు అంబటి రాయుడు (50) పాకిస్థాన్ చాంపియన్స్ బౌలర్లను ఉతికేయగా భారీ విజయంతో ట్రోఫీని ముద్దాడింది.
We are the champions. pic.twitter.com/U36sygAxtw
— Irfan Pathan (@IrfanPathan) July 13, 2024
పాక్ నిర్దేశించిన 157 పరుగుల లక్ష్య చేధనలో రాయుడు మెరుపులు మెరిపించగా.. గురుకీరత్ సింగ్ మాన్(34), యూసుఫ్ పఠాన్(30)లు దంచికొట్టారు. దాంతో, యువరాజ్ సింగ్ సారథ్యంలోని భారత జట్టు 5 వికెట్ల విజయంతో చాంపియన్‌గా అవతరించింది.
ఇవి కూడా చదవండి
- Realme GT 6T | కొత్త కలర్ ఆప్షన్ లో రియల్ మీ జీటీ 6టీ.. 20 నుంచి సేల్స్ షురూ..!
- Anjaneri Fort | ఫలించిన రెస్క్యూ ఆపరేషన్ : అంజనేరి కోటలో చిక్కుకున్న 200 మంది టూరిస్ట్‌లు సేఫ్
- Team India | ఓపెనింగ్ జోడీ కుదిరినట్టేనా.. సీనియర్లను మరిపించేది ఎవరు..?
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

