Anjaneri Fort | ఫలించిన రెస్క్యూ ఆపరేషన్ : అంజనేరి కోటలో చిక్కుకున్న 200 మంది టూరిస్ట్‌లు సేఫ్
Anjaneri Fort : మహారాష్ట్ర నాసిక్ సమీపంలోని అంజనేరి కోటలో భారీ వర్షాలతో చిక్కుకుపోయిన దాదాపు 200 మంది టూరిస్టులను సహాయ సిబ్బంది రక్షించారు.
Anjaneri Fort : మహారాష్ట్ర నాసిక్ సమీపంలోని అంజనేరి కోటలో భారీ వర్షాలతో చిక్కుకుపోయిన దాదాపు 200 మంది టూరిస్టులను సహాయ సిబ్బంది రక్షించారు. ఆరు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన రెస్క్యూ ఆపరేషన్‌లో పర్యాటకులు క్షేమంగా బయటపడటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. మరోవైపు మహారాష్ట్ర రాజధాని, దేశ వాణిజ్య రాజధాని ముంబైని మళ్లీ భారీ వర్షాలు ముంచెత్తాయి. శనివారం నుంచి కురుస్తున్న వర్షాలతో నగరం తడిసిముద్దయింది.
#WATCH | Nashik, Maharashtra: Around 200 tourists stranded at the Anjaneri Fort after heavy rains were rescued after a six-hour-long rescue operation yesterday pic.twitter.com/9Q1gY0WKjB
— ANI (@ANI) July 15, 2024
పలు రహదారులు జలమయమవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రెండు రోజుల పాటు ముంబై, థానేల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక రాయ్‌గఢ్ జిల్లాలో సోమవారం మధ్యాహ్నం నుంచి బుధవారం వరకూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ముంబైకి నీటిని సరఫరా చేసే ఏడు చెరువుల్లో నీటి నిల్వలు ఒక్కరోజులోనే అనూహ్యంగా పెరిగాయని అధికారులు తెలిపారు.
మరాఠ్వాడాలో మంగళవారం అతిభారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. ఆ ప్రాంతానికి ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.ఐఎండీ హెచ్చరికలతో అప్రమత్తమైన అధికారులు పలు చర్యలు చేపట్టారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు సహాయ పునరావాస సిబ్బందిని అప్రమత్తం చేయాలని ఆయా జిల్లా అధికారులకు సూచించారు.
Read More :
Chalo Secretariat | నిరుద్యోగుల మార్చ్.. పోలీసుల గుప్పిట్లో సచివాలయం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా రాపోలు పరమేశ్
‘కుమ్మరులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.300 కోట్ల బడ్జెట్ కేటాయించాలి’
Plague | ప్లేగు భయంతో రూ.300 కిట్ విక్రయాలు.. వైద్య నిపుణుల హెచ్చరిక..
Twisha Sharma | త్విషా శర్మ మృతి కేసు.. సీబీఐ, గిరిబాలా సింగ్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
AP Minister | పొత్తులో జనసేనకు సీటు.. కంటతడి పెట్టుకున్న ఏపీ మంత్రి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

