Realme GT 6T | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ తన రియల్మీ జీటీ 6టీ ఫోన్ మరో కలర్ ఆప్షన్ లో త్వరలో భారత్ మార్కెట్లోకి తేనున్నది. త్వరలో అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రియల్మీ తన రియల్మీ జీటీ 6టీ ఫోన్ను మరో కలర్ ఆప్షన్ లో తీసుకొస్తోంది. గత మే నెలలో రియల్మీ జీటీ 6టీ ఫోన్ భారత్ మార్కెట్లోకి ఎంటరైంది. ఫ్లూయిడ్ సిల్వర్, రేజర్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో లభిస్తున్నదీ ఫోన్. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 7+ జెన్ 3 ప్రాసెసర్ తో పని చేస్తుందీ ఫోన్. 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరాతోపాటు డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ ఉంటుంది.
అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ ప్రారంభం సందర్భంగా ఈ నెల 20 అర్థరాత్రి రియల్మీ జీటీ 6టీ ఫోన్ మిరాకిల్ పర్పుల్ కలర్ ఆప్షన్ విక్రయాలు ప్రారంభం అవుతాయి. అమెజాన్, రియల్మీ వెబ్ సైట్లలో మాత్రమే ఈ ఫోన్ లభిస్తుంది. రియల్మీ జీటీ 6టీ ఫోన్ 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.32,999, 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.35,999లకు లభిస్తాయి.
రియల్మీ జీటీ 6టీ ఫోన్ ఆండ్రాయిడ్ 14 బేస్డ్ రియల్మీ యూఐ 5 ఓఎస్ వర్షన్ మీద పని చేస్తుంది. మూడు ఓఎస్ అప్ డేట్స్, నాలుగేండ్లు సెక్యూరిటీ అప్ డేట్స్ అందిస్తుంది. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటు మద్దతుతో 1000 నిట్స్ పీక్ బ్రైట్ నెస్, 6.78 అంగుళాల ఫుల్ హెచ్డీ + (1264×2780 పిక్సెల్స్) ఎల్టీపీఓ అమోలెడ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. 4ఎన్ఎం క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 7+ జెన్3 ప్రాసెసర్ తో పని చేస్తుంది.
రియల్మీ జీటీ 6టీ ఫోన్ 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా విత్ సోనీ ఎల్వైటీ 600 సెన్సర్, 8-మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్355 సెన్సర్ కెమెరాతోపాటు సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 32 మెగా పిక్సెల్స్ సోనీ ఐఎంఎక్స్615 సెన్సర్ కెమెరా ఉంటాయి. ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, 120 వాట్ల సూపర్ వూక్ చార్జింగ్ మద్దతుతో 5500 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటుంది.