స్టేషన్ ఘన్పూర్,నవంబర్ 22: జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్లోని సోషల్ వెల్ఫేర్ గురుకుల కళాశాల విద్యార్థులు జాతీయస్థాయి టెన్నికాయిట్ టోర్నీకి ఎంపికయ్యారు. ఈ విషయాన్ని కళాశాల ప్రిన్సిపాల్ రవీందర్ తెలిపారు.
టెన్నికాయిట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 20న హనుమకొండలో నిర్వహించిన 9వ తెలంగాణ రాష్ట్రస్థాయి జూనియర్ టెన్నికాయిట్ పోటీల్లో సీహెచ్ పవన్(ఎంపీసీ, రెండో సంవత్సరం) మొదటి స్థానంలో, పదో తరగతి చదువుతున్న ప్రణయ్ నాలుగో స్థానంలో నిలిచారని రవీందర్ తెలిపారు. వీరు ఈనెల 26 నుంచి 30వ తేదీ వరకు జమ్మూకశ్మీర్లో జరిగే జాతీయ టెన్నికాయిట్ టోర్నీలో పాల్గొంటారని కాలేజీ పీడీ గుంటి శ్రీనివాస్, పీఈటీ లక్ష్మణ్, కోచ్ ప్రవీణ్ వెల్లడించారు.