Brendon McCullum : యాషెస్ సిరీస్‌ను అవమానకమరైన ఓటమితో ప్రారంభించింది ఇంగ్లండ్. పెర్త్‌లో బ్యాటర్ల వైఫల్యంతో రెండో రోజే మ్యాచ్ అప్పగించిన ఇంగ్లీష్ టీమ్ సిరీస్‌లో 1-0తో వెనకబడింది. తమ జట్టు దారుణంగా ఓడడాన్ని మాజీ ఆటగాళ్లు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. తలొకతీరుగా మాట్లాడుతున్న వేళ ఓటమిపై కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ (Brendon McCullum) స్పందించాడు. పెర్త్‌లో ఓటమి తమను ఎంతగానో బాధిస్తుందని అన్నాడు. ఊహించని ఈ పరాభవం నుంచి తేరుకొని రెండో మ్యాచ్‌కు సిద్దమవుతామని, తమ జట్టు గొప్పగా పుంజుకుంటుందని మెక్కల్లమ్ చెప్పాడు.
‘పెర్త్‌లో భారీ ఓటమిపై స్పందించకుండా ఉండేందుకు ఎంతో ప్రయత్నిస్తున్నాం. ఈ పరాజయం కచ్చితంగా మమల్ని బాధిస్తుంది. మా జట్టు సభ్యులనే కాదు ఇంగ్లండ్ జట్టును పోత్సహించే ప్రతిఒక్కరిని పెర్త్ ఓటమి బాధకు గురి చేస్తుంది. జట్టు ఓడిపోవడంతో చాలామందిన నానా రకాలుగా మాట్లాడుతున్నారు. అయితే.. మా ఆత్మవిశ్వాసం, మా టీమ్ స్ఫూర్తి దెబ్బతినకుండా చూసుకోండం మాకు చాలా ముఖ్యం. మేము చాలా బెస్ట్ అని, మాది మంచి క్రికెట్ జట్టని మాకు తెలుసు.
A disappointing start to the series.
We’re beaten in Perth. pic.twitter.com/gsmjButBLy
— England Cricket (@englandcricket) November 22, 2025
బ్రిస్బేన్ టెస్టుకు సిద్ధమయ్యేందుకు మాకు సరిపోను సమయం దొరికింది’ అని మెక్కల్లమ్ తెలిపాడు. తొలి టెస్టులో తమ నుంచి విజయాన్ని లాగేసుకున్న ట్రావిస్ హెడ్‌పై ఇంగ్లండ్ కోచ్ ప్రశంసలు కురిపించాడు. ఈమధ్య కాలంలో తాను చూసిన అద్భుత ఇన్నింగ్స్ హెడ్దేనని అన్నాడతడు. ‘పెర్త్ వికెట్‌పై రెండో ఇన్నింగ్స్‌లో 200 మంచి స్కోర్ అనుకున్నాం. కానీ, ట్రావిస్ హెడ్ అద్భుతంగా ఆడాడు. ఇలాంటి కఠినమైన వికెట్ మీద ఒత్తిడిలో ఇంత గొప్ప ఇన్నింగ్స్ ఆడడం నేను ఇదివరకూ చూడలేదు. మా బౌలర్ల లైన్ అండ్ లెంగ్త్‌ను అతడు దెబ్బతీశాడు. తనదైన దూకుడుతో బౌలర్లను ఒత్తిడిలో పడేశాడు హెడ్. అతడంతలా చెలరేగి ఆడగా మేము ఏం చేయలేకపోయాం. 69 బంతుల్లోనే శతకంతో మ్యాచ్‌ను ఆసీస్ వైపు తిప్పాడు హెడ్.
Travis Head leads the Aussie charge in the chase with his 10th Test century in Perth 💯#WTC27 #AUSvENG 📝: https://t.co/eE4SSOzEUc pic.twitter.com/TrKo5xzStt
— ICC (@ICC) November 22, 2025
అతడిని ఓపెనర్‌గా పంపాలనే నిర్ణయం సాహసోపేతమైన నిర్ణయం. కెప్టెన్ స్మిత్, కోచ్ మెక్‌డొనాల్డ్ తీసుకున్న ఆ నిర్ణయం వాళ్లకు అద్భుత ఫలితాన్నిచ్చింది. మరో విషయం..స్కాట్ బొలాండ్ చక్కగా బౌలింగ్ చేశాడు’ అని ఇంగ్లండ్ కోచ్ అన్నాడు. పెర్త్ టెస్టులో తొలి రోజే 19 వికెట్లు పడిన వేళ.. మ్యాచ్‌పై ఉత్కంఠ నెలకొంది. అయితే.. అనూహ్యంగా ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో మట్టికరిచింది. ఇరుజట్ల మధ్య బ్రిస్బేన్‌లో డిసెంబర్ 4 నుంచి రెండో టెస్టు జరుగనుంది.