న్యూఢిల్లీ, నవంబర్ 22: ఎడ్యుటెక్ సంస్థ బైజూస్ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బైజూస్ ఆల్ఫా, అమెరికాకు చెందిన రుణదాత గ్లాస్‌ట్రస్ట్ కంపెనీ ఎల్ఎల్సీ చేసిన పిటిషన్‌పై అమెరికా కోర్టు డిఫాల్ట్ జడ్జిమెంట్ వెలువరించింది. పిటిషనర్లకు బిలియన్ డాలర్ల వ్యక్తిగతంగా చెల్లించాలని బైజూస్ రవీంద్రన్‌ను ఆదేశించింది. ఈ నెల 20న వెలువరించిన తీర్పులో ఈ విషయాన్ని స్పష్టంచేసింది. తమ తీర్పును రవీంద్రన్ పలుమార్లు ఉల్లంఘించడాన్ని, పట్టించుకోకపోవడంతో ఈ ఆదేశాలు జారీ చేస్తున్నట్టు డెలావేర్ దివాలా పరిష్కార తన తీర్పులో పేర్కొంది.
బైజూస్ పేరిట సేవలందిస్తున్న సమయంలో బైజూస్ ఆల్ఫాను 2021లో ప్రారంభించారు. అంతర్జాతీయ రుణ దాతల నుంచి నిధులు సమీకరించే ఉద్దేశంతో ఈ కంపెనీని ఏర్పాటు చేసినట్టు గతంలోనే ఆరోపణలు వచ్చాయి. దీనిద్వారా బైజూస్ ఆల్ఫా బిలియన్ డాలర్ల టర్మ్‌లోన్-బీ బైజూస్ పొందింది. అయితే బైజూస్ టర్మ్‌లోన్ నింబంధనలను ఉల్లంఘించిందని, మొత్తం అప్పులో 533,000,000 డాలర్ల నిధులను అమెరికా నుంచి చట్టవిరుద్ధంగా తరలించినట్టు రుణదాతలు ఆరోపించారు.
ఈ క్రమంలోనే గ్లాస్ ట్రస్ట్ కోర్టును అనుమతించింది. బైజూస్ ఆల్ఫా, గ్లాస్ ట్రస్ట్ 533 మిలియన్ డాలర్లకు సంబంధించిన నిధుల లావాదేవీల కోసం మరోసారి కోర్టును ఆశ్రయించాయి. దీంతో సంబంధిత వివరాలు సమర్పించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. డిస్కవరీ ఆదేశాల గురించి తెలిసి కూడా రవీంద్రన్ చూసీచూడనట్టు వ్యవహరించారని కోర్టు పేర్కొంది.
ఈ విషయంలో కోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోలేదని తెలిపింది. ఉద్దేశపూర్వకంగా రవీంద్రన్ కోర్టు ఉల్లంఘనకు పాల్పడుతున్నట్టు గుర్తించిన కోర్టు..డిఫాల్ట్ ఆదేశాలు జారీ చేసింది. బైజూస్ ఆల్ఫాకు సంబంధించి 533 మిలియన్ డాలర్లు, క్యామ్షాప్ట్ హెడ్జ్ ఫండ్ ఇంట్రెస్ట్‌కు సంబంధించిన 540,647,109.29 డాలర్ల నిధులను వెంటనే చెల్లించాలని బైజూస్‌ను ఆదేశించింది.