కాచిగూడ,నవంబర్ 17 : శీతకాల పార్లమెంట్ సమావేశాల్లోనే బీసీల రిజర్వేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం అమోదించాలని, లేనియేడల త్వరలో పార్లమెంట్‌ను ముట్టడిస్తామని బీసీ జేఏసీ తెలంగాణ రాష్ట్ర కో అర్డినేటర్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం హెచ్చరించారు. సోమవారం కాచిగూడలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను పార్టీ పరంగా ఇస్తే ఒప్పుకునే ప్రసక్తేలేదని, చట్టబద్ధంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
న్యాయమైన బీసీ రిజర్వేషన్లను సాధించే వరకు బీసీల ఉద్యామం ఆగదని, త్వరలో తెలంగాణ వ్యాప్తంగా బీసీల పోరాటాం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాజ్యాంగ సవరణ చేసి, తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి అఖిల పక్షాన్ని ప్రధానమంత్రి వద్దకు తీసుకువెళ్లాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలని సూచించారు. తెలంగాణ బీసీలను సీఎం నమ్మించి మోసం చేశాడని, త్వరలో బీసీ ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు.