హుజూరాబాద్: నియోజకవర్గంలోని ఏ ఊరెళ్లినా టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌కు ప్రజలనుంచి ఘన స్వాగతం లభిస్తోంది. జమ్మికుంట పట్టణంలోని 15వ వార్డు కేశవాపూర్‌లో ఆదివారం గెల్లు శ్రీనివాస్‌యాదవ్ ప్రచారం నిర్వహించారు. గ్రామస్తులు డప్పు సప్పుళ్లు, కోలాటాలు, మంగళహారతులతో ఘనస్వాగతం పలికారు. మహిళలు వీరతిలకం దిద్దగా..అడుగడుగునా అవ్వలు దీవెనార్థులు ఇచ్చారు.
కాగా, గెల్లు శ్రీనివాస్‌యాదవ్ కేశవాపూర్‌లోని గడపగడపకూ తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. తనను ఆశీర్వదిస్తే హుజూరాబాద్ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని చెప్పారు. ఆయన వెంట మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్, కోరుకంటి చందర్, స్థానిక మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్‌రావు, వైస్ చైర్మన్ దేశిని స్వప్నకోటి, వార్డు కౌన్సిలర్ పాతకాల రమేశ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మిరుపాల తిరుపతిరావు, ప్రభాకర్‌రావు, వీర్రాజు, శ్రీనురావు, పాతకాల ఓదెలు, పాతకాల నర్సయ్య, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.