Grama Devathalu | కోహీర్, జూలై 13 : కోహీర్ మండలంలోని మద్రి, సజ్జాపూర్ గ్రామాల్లో ఊరడమ్మ, దుర్గమ్మ, మైసమ్మ, పోచమ్మ, తదితర గ్రామ దేవతలకు భక్తి శ్రద్ధలతో బోనాలను సమర్పించారు. ఆదివారం అందంగా అలంకరించిన బోనాలతో గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. పోతరాజుల విన్యాసాలు, డప్పు కళాకారుల ఆట పాటలు, యువకుల నృత్యాల మధ్య బోనాలతో ఊరేగింపు చేశారు.
అనంతరం ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించి గ్రామ దేవతలకు నైవేద్యం సమర్పించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు గోవర్ధన్‌రెడ్డి, అడివిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు సుదర్శన్‌రెడ్డి, నర్సింహులు, బుచ్చిరెడ్డి, సుభాశ్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Protest | కస్టోడియల్ డెత్‌పై నటుడు విజయ్ నేతృత్వంలో టీవీకే భారీ నిరసన.. Video
Sircilla | సిరిసిల్లలో ఇసుక ట్రాక్టర్ ట్రిప్పుకు 6 వేలు.. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఆందోళన
Nagarkurnool | తిమ్మినోనిపల్లిలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం