రాబోయే 20 ఏళ్లలో చెరువులు, కుంటలు, రోడ్ల ఏర్పాటుకు కార్యాచరణ
టౌన్ ప్లానర్‌ను నియమించిన రాష్ట్ర ప్రభుత్వం
అమరవీరుల స్తూపం వద్ద రాష్ట్ర అవతరణ వేడుకలు
డంపింగ్ యార్డుతో ప్రజలకు ఇబ్బందులు రావొద్దు
మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్‌రెడ్డి, కమిషనర్ ప్రసన్నారాణి
మహబూబాబాద్, మే 28 : రాబోయే 20 ఏళ్లలో మహబూబాబాద్ పట్టణాన్ని ఏవిధంగా అభివృద్ధి చేయాలనే దానిపై ప్రత్యేక ప్రణాళిక చేసినట్లు మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్‌రెడ్డి, కమిషనర్ ప్రసన్నారాణి వెల్లడించారు. శనివారం మున్సిపల్ కార్యాలయంలో అభివృద్ధికి సంబంధించిన మ్యాప్‌ను కమిషనర్, ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించిన అర్బన్ ప్లానర్ ఆదిల్ పర్హాన్, టీపీవో నవీన్‌తో కలిసి పరిశీలించారు. ఎలాంటి ప్రణాళికతో ముం దుకెళ్లాలో చర్చించారు. ఈ సందర్భంగా చైర్మన్, కమిషనర్ మాట్లాడుతూ.. ఉమ్మడి వరంగల్ రీజియన్‌లో మహబూబాబాద్, భూపాలపల్లి మున్సిపాలిటీల్లో 20 ఏళ్లలో అభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపట్టాలనే విషయాలపై రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ కార్యాలయం వరంగల్‌లో అధికారి మైఖేల్ మాస్టర్ ప్లాన్‌పై శుక్రవారం సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. అందులో భాగంగా ప్రత్యేక అర్బన్ ప్లానర్లను ప్రకటించారని, మానుకోటకు ఆదిల్ పర్హాన్ను నియమించినట్లు తెలిపారు. ఈ క్రమంలో శనివారం నుంచి పది రోజులపాటు రాష్ట్ర ప్రభు త్వం నియమించిన నాలుగు బృందాలతో ఫీల్డ్‌వర్క్ చేస్తామన్నారు. ప్లానింగ్ అధికారి మైఖేల్ ఆదేశాల మేరకు పట్టణ అభివృద్ధికోసం నోడల్ అధికారి ప్రసాద్, రీజినల్ అధికారులు, మున్సిపల్ కమిషనర్ ప్రసన్నారాణి, టౌన్ ప్లానింగ్ అధికారి నవీన్, టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ ప్రవీణ్‌బాబు, అర్బన్ ప్లానర్ అధికారి ఆదిల్ పర్హాన్‌తో కూడిన బృందా లు ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నాయని పేర్కొన్నారు.
చెరువులు, రోడ్ల ఏర్పాటుకు కార్యాచరణ
మానుకోట పట్టణ అభివృద్ధికి ప్రత్యేకంగా చెరువులు, కుంటల పరిరక్షణ, పట్టణ శివారు ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం, రాబోయే 20 ఏళ్లలో ప్రజల ప్రయాణానికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా రింగ్‌రోడ్డు నిర్మాణానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. ఇప్పటికే చేపట్టిన రోడ్లవెడల్పునకు ప్రజలు పూర్తిస్థాయిలో సహకరించాలని సూచించారు. చెరువులు, కుంటల శిఖం భూములు అన్యాక్రాంతం కాకుండా వాటి చుట్టూ ప్లాంటేషన్ నిర్మించి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించనున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా రింగ్‌రోడ్డు నిర్మాణానికి ప్రత్యేక ప్రణాళిక చేస్తామని, ఇందుకోసం ప్రజల నుంచి అభిప్రాయ సేకరణసైతం ప్రారంభమైందన్నారు. ఇం దులో భాగంగా కొన్ని సర్వే బృందాలు పట్టణంలో ప్రజల నుంచి విషయాలను తెలుకుంటున్నాయని వివరించారు.
అమరవీరుల స్తూపం వద్ద రాష్ట్ర అవతరణ వేడుకలు
మున్సిపాలిటీ పరిధిలో ఎన్ని డంపింగ్ యార్డులున్నా.. వాటి వల్ల వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని మున్సిపల్ అధికారులకు చైర్మన్ పాల్వాయి రామ్మోహన్‌రెడ్డి సూచించారు. మున్సిపల్ పరిధి 26వ వార్డులోని డంపింగ్ యార్డును, వైకుంఠధామం నిర్మాణ పనులు, సిగ్నల్ కాలనీలోని డ్రైనేజీ వ్యవస్థను, జిల్లా వైద్యశాల, అమరవీరుల స్తూపం వద్ద పారిశుధ్య పనులను డీఈ ఉపేందర్‌తో కసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వార్డులో వైకుంఠధామం నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. రానున్న వర్షాకాలంలో డ్రైనేజీ వ్యవస్థ పనితీరు బాగుండాలన్నారు. అమరవీరుల స్తూపం వద్ద జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. చైర్మన్ వెంట శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీహరి, జవాను శ్రీను, వార్డు కౌన్సిలర్ డౌలాగర్ స్వాతీశంకర్, వైద్యశాల సిబ్బంది ఉన్నారు.