DA hike | పండగ వేళ కేంద్ర ప్రభుత్వంలోని ఉద్యోగులకు (central government employees) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం శుభవార్త చెప్పనున్నట్లు తెలుస్తోంది. డియర్నెస్ అలవెన్స్ (dearness allowance) (కరవు భత్యం) సరవణ చేయనున్నట్లు (DA Hike) తెలిసింది. నేడు ప్రధాని అధ్యక్షతన జరిగే సమావేశంలో కేంద్ర మంత్రివర్గం దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు తాజాగా తెలిపాయి. మంత్రివర్గం ఆమోదం తర్వాత సవరించిన డీఏ జులై 1 నుంచే అమల్లోకి రానుంది. ప్రభుత్వ నిర్ణయంతో దాదాపు కోటి మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఉపశమనం లభించనుంది.
కేంద్ర ప్రభుత్వం సాధారణంగా ఏటా రెండుసార్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ (dearness allowance) పెంచుతుంది. ఇది జనవరి, జులైల్లో జరగాల్సి ఉన్నప్పటికీ ఏటా మార్చి, అక్టోబరులో ప్రకటిస్తూ వస్తోంది. ఆలస్యంగా ప్రకటించినా.. బకాయిలతో కలిపి జనవరి, జులై నుంచే చెల్లిస్తారు. ముఖ్యంగా డీఏ సవరణ కోసం ఆల్ ఇండియా కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్‌ను (AICPIN-IW) ప్రాతిపదికగా తీసుకుంటుంది. ఇదే ద్రవ్యోల్బణాన్ని అంచనా వేస్తుంది. ఈ ఏడాది మార్చిలో 2శాతం పెంచింది. దీంతో డియర్నెస్ అలవెన్స్ రేటు 53శాతం నుంచి 55శాతానికి పెరిగింది. ఇప్పుడు ఎంత మేర పెంచుతారన్నదానిపై క్లారిటీ లేదు. గతేడాది అక్టోబర్‌లో మాత్రం దీపావళి కానుకగా డీఏ 3 శాతం పెంచిన విషయం తెలిసిందే. కేంద్రం డీఏను సరవించిన నేపథ్యంలో రాష్ట్రాలు సైతం తమ ఉద్యోగులకు ఆ మేరకు డీఏ పెంచే అవకాశం ఉంటుంది.
Also Read..
Zubeen Garg | సింగర్ మరణంపై అనుమానాలు.. జుబీన్ మేనేజర్ అరెస్ట్
Navratri feast | నో ఎంట్రీ జోన్లోకి దూసుకెళ్లిన బస్సు.. 13 మందికి గాయాలు