Viral news : అతడొక ప్రభుత్వ పాఠశాల (Govt school) ప్రిన్సిపల్. కానీ థౌజెండ్ (Thousand) స్పెల్లింగ్ రాయరాదు. హండ్రెడ్ (Hundred) స్పెల్లింగ్ రాదు. సిక్స్‌కు సిక్స్టీన్కు తేడా తెలియదు. కనీసం సెవెన్ (Seven) స్పెల్లింగ్ కూడా చక్కగా రాయడం రాలేదు. ఆయన రూ.7,616ను (సావెన్ థర్స్డే సిక్స్ హరేంద్ర సిక్స్ రూపీస్ ఓన్లీ) అని రాశాడు. ఈ చెక్కు ఇప్పుడు సోషల్ మీడియా (Social Media) లో వైరల్‌గా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ఓ ప్రభుత్వ స్కూల్ ప్రిన్సిపాల్ మిడ్డే మీల్ వర్కర్స్కు ఇవ్వాల్సిన నగదుకు సంబంధించి రూ.7,616 చెక్కు ఇచ్చాడు. అయితే ఆ చెక్కులో నగదుకు సంబంధించి ఇంగ్లిష్‌లో అన్నీ తప్పులే రాశాడు. దాంతో బ్యాంకు అధికారులు స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయంటూ ఆ చెక్కును నగదుగా మార్చకుండా రిజక్ట్ చేశారు.
ఆ చెక్కును సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది. నెటిజన్ల నుంచి రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఇలాంటి వాళ్లు ఉన్నారు కాబట్టే పేరెంట్స్ తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లకు పంపేందుకు భయపడుతున్నారని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. రిజర్వేషన్లతో ఉపాధ్య ఉద్యోగాలు ఇస్తే ఇలాగే ఉంటుందని మరో నెటిజన్ రెస్పాండ్ అయ్యాడు. సార్ తప్పులేదు, పెన్నే సరిగా రాయలే అని మరో నెటిజన్ ఎద్దేవా చేశాడు.