Tere Ishk Mein | తనకు బాలీవుడ్లో రాన్‌జానా వంటి సూపర్ హిట్‌ని అందించిన దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్‌తో ధనుష్ ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ‘తేరే ఇష్క్ మే’ అంటూ రాబోతున్న ఈ సినిమాలో ధనుష్ ఎయిర్‌ఫోర్స్ అధికారిగా కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో కృతి సనన్ కథానాయికగా నటించబోతుండగా.. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం హిందీతో పాటు తమిళంలో నవంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ టీజర్ చూస్తుంటే.. ధనుష్ ప్రేమలో మోసపోయిన వ్యక్తిగా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. నా తండ్రిని దహనం చేయడానికి బనారస్ (కాశీ) వెళ్లాను. అప్పుడే నీకోసం కొంత పవిత్ర గంగాజలం తేవాలి అనుకున్నాను. నువ్వు కోత్త జీవితం ప్రారంభించబోతున్నావు కదా. కనీసం నీ పాత పాపలను కడుక్కో. అంటూ కృతితో ధనుష్ చెప్పే డైలాగ్ టీజర్‌కే హైలైట్‌గా నిలిచింది.
ఈ సినిమాకు హిమాన్షు శర్మ, నీరజ్ యాదవ్ కథను అందిస్తుండగా.. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహిస్తున్నాడు. భుషణ్ కుమార్, కృష్ణ కుమార్, ఆనంద్ ఎల్ రాయ్, హిమాన్షు శర్మ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.