Auto Sales | సెప్టెంబర్‌లో రిటైల్ ఆటోమొబైల్ సేల్స్ దాదాపు 13శాతం పడిపోయాయి. పండుగ సీజన్‌కు ముందు నెలాఖరు నాటికి డిమాండ్ మొదలైంది. దాంతో ఆటో కంపెనీలకు ఊరట కలుగడంతో పాటు అక్టోబర్‌పై ఆశలను రేకెత్తించింది. వాహన్ పోర్టల్ డేటా ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నాటికి మొత్తం 1.51 మిలియన్ వాహనాలు నమోదయ్యాయి. గత సంవత్సరం ఇదే సమయంలో 1.74 మిలియన్ యూనిట్లతో పోలిస్తే ఇది 13.28 శాతం తగ్గింది. ఈ గణాంకాలు రిజిస్ట్రేషన్స్ మాత్రమే ప్రతిబింబిస్తాయని.. పూర్తి డెలివరీల వివరాలు కొద్దిరోజుల తర్వాత మాత్రమే తెలుస్తుందని ఆటో పరిశ్రమ నిపుణులు తెలిపారు. సెప్టెంబర్ తొలి మూడువారాల్లో కొనుగోళ్లు మందగించాయి.
పండుగ ఆఫర్లు, జీఎస్టీ రేట్లలో మార్పుల్లో స్పష్టత కోసం కొనుగోలుదారులు వాహనాలను కొనుగోలు చేయకుండా నిరీక్షించినట్లుగా పరిశ్రమ వర్గాలు తెలిపాయి. అదే సమయంలో పితృపక్షాలు సైతం షాపింగ్‌ను ప్రభావితం చేసిందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్ 22న నవరాత్రుల ప్రారంభం నుంచే మార్కెట్లో సందడి కనిపించిందని.. జీఎస్టీ సంస్కరణలతో ధరలు సైతం తగ్గడంతో షోరూమ్స్ సందడిగా కనిపించినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. ముఖ్యంగా ప్యాసింజర్ కార్లు, ద్విచక్ర వాహనాల విభాగాల షోరూమ్‌ల్లో కస్టమర్ల రద్దీ, బుకింగ్‌లు, ఎక్వైరీలు పెరిగాయి. దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి సెప్టెంబర్ 22 నుంచి 25 మధ్య కేవలం నాలుగు రోజుల్లో 75వేల వాహనాలను విక్రయించింది.
మారుతి ఆగస్టు నెల మొత్తంలో సుమారు 1.35లక్షల యూనిట్లను విక్రయించింది. నెలాఖరు నాటికి డిమాండ్ ఎంత వేగంగా పెరిగిందో గణాంకాలు చెబుతున్నాయి. గత సంవత్సరం అక్టోబర్‌లో నవరాత్రి వేడుకలు ప్రారంభం కాగా.. పండుగల ప్రభావం సెప్టెంబర్‌లో కనిపించలేదు. ఈ సంవత్సరం సెప్టెంబర్ చివరి వారంలో డిమాండ్ కనిపించింది. ఇక రాబోయే నెలల్లో అమ్మకాలు జోరుగా సాగుతాయని ఆటోమొబైల్ ఇండస్ట్రీ భావిస్తున్నది. అక్టోబర్‌లో పండుగలు కొనసాగనున్నాయి. ఆ తర్వాత పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమవుతుంది. పెట్రోల్ కార్లపై (1200సీసీ వరకు), డీజిల్ కార్లపై (1500 సీసీ వరకు) 18శాతానికి జీఎస్టీ తగ్గింది. అంతకంటే ఎక్కువ సీసీ కలిగిన వాహనాలపై 40శాతం.. ఇక ఎలక్ట్రికల్ వాహనాలపై కేవలం 5శాతం జీఎస్టీ పరిమితం చేయడంతో పరిశ్రమకు ఊతమిస్తుందని ఆటో ఇండస్ట్రీ భావిస్తున్నది.
Read More :
RBI Repo Rate | ఆర్బీఐ కీలక ప్రకటన.. వడ్డీరేట్లు మరోసారి యథాతథం
LPG Cylinder Prices Hike | పండుగల వేళ పెరిగిన గ్యాస్ ధర.. కమర్షియల్ సిలిండర్‌పై రూ.15.50 వడ్డన..!
October Bank Holidays | ఈ అక్టోబర్‌లో 21 రోజులు బ్యాంకులు మూసివేత.. సెలవుల ఫుల్ లిస్ట్ ఇదే..!