October Bank Holidays | ఈ ఆర్థిక సంవత్సరంలో మరో నెల ముగిసిపోయింది. అక్టోబర్ మాసంలో దాదాపుగా 20 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. ప్రతినెలా బ్యాంకులకు సెలవులు ఉండే విషయం అందరికీ తెలిసిందే. బ్యాంకుల సెలవులకు సంబంధించిన జాబితాను రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసింది. ఏవైనా ఆర్థిక సంబంధిత పనుల కోసం వెళ్లేవారు ఏయే రోజుల్లో బ్యాంకులు పని చేస్తాయో.. సెలవులుంటాయో తెలుసుకోవడం మంచిది. సాధారణ సెలవులతో పాటు పండుగ సెలవులు కలుపుకొని 20 రోజులు సెలవులు రానున్నాయి. అయితే, బ్యాంకులు మూసి ఉన్నా మొబైల్, ఇంటర్నెట్ బ్యాంక్, యూపీఐ సర్వీసులు యథావిధిగా పని చేయనున్నాయి. అయితే, కొన్ని అవసరాల కోసం తప్పనిసరిగా బ్యాంకుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. నగదు ఉపసంహరణ కోసం ఏటీఎంలు అందుబాటులో ఉండనున్నాయి. పలు బ్యాంకులు క్యాష్ డిపాజిట్ కోసం మెషిన్స్ సైతం అందుబాటులో ఉంచాయి. ఇందులో అకౌంట్లో డబ్బులు చేసుకునే వీలున్నది. కొన్ని సేవల కోసం బ్యాంకులకు వెళ్లే అవసరం ఉంటుంది. అలాంటి సమాచారం సెలవుల గురించి సమాచారం ఉంటే.. ముందస్తుగానే పనులు చేసుకునే వీలుంటుంది. మరి అక్టోబర్‌లో ఏ రోజుల్లో బ్యాంకులకు సెలవులు వచ్చాయో తెలుసుకుందాం రండి..!
అక్టోబర్ 1 : మహర్నవమి, దుర్గాపూజల సందర్భంగా అగర్తల, బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, గ్యాంగ్‌టక్, గౌహతి, ఇటానగర్, కాన్పూర్, కొచ్చి, తిరువనంతపురం, కొహిమా, కోల్‌కతా, లక్నో, పాట్నా, రాంచీ, షిల్లాంగ్‌లో బ్యాంకులకు హాలీడే.
అక్టోబర్ 2 : మహాత్మా గాంధీ జయంతి, దసరా సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు.
అక్టోబర్ 3 : దుర్గాపూజ నేపథ్యంలో గాంగ్టక్లో బ్యాంకుల మూసివేత.
అక్టోబర్ 5 : ఆదివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్.
అక్టోబర్ 6 : లక్ష్మీపూజ నేపథ్యంలో అగర్తల, కోల్‌కతాలోని బ్యాంకులు బంద్.
అక్టోబర్ 7 : వాల్మీకి జయంతి, కుమార్ పూర్ణిమ సందర్భంగా బెంగళూరు, భువనేశ్వర్, చండీగఢ్, సిమ్లాలోని బ్యాంకులకు సెలవులు.
అక్టోబర్ 10 : కర్వా చౌత్ సందర్భంగా సిమ్లాలోని బ్యాంకులు మూసి ఉంటాయి.
అక్టోబర్ 11 : రెండోశనివారం సందర్భంగా బ్యాంకులకు సెలవులు.
అక్టోబర్ 12 : ఆదివారం సందర్భంగా బ్యాంకులు బంద్.
అక్టోబర్ 18 : కటి బిహు సందర్భంగా గౌహతిలో బ్యాంకులకు హాలీడే.
అక్టోబర్ 19 : ఆదివారం కావడంతో సెలవు.
అక్టోబర్ 20 : దీపావళి, నరక చతుర్దశి, కాళిపూజ సందర్భంగా అహ్మదాబాద్, బెంగళూరు, కోల్‌కతా, న్యూఢిల్లీ, లక్నో, చెన్నై సహా పలునగరాల్లో బ్యాంకుల మూసివేత.
అక్టోబర్ 21 : దీపావళి, గోవర్ధన్ పూజ సందర్భంగా ఏపీ, తెలంగాణతో పాటు బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, గ్యాంగ్‌టక్, ఇంఫాల్, జమ్ము, ముంబయి, నాగ్‌పూర్, శ్రీనగర్‌లో బ్యాంకులు బంద్.
అక్టోబర్ 22 : దీపావళి, విక్రమ్ నూతన సంవత్సరం, బలిపాడమి, లక్ష్మీ పూజ కారణంగా అహ్మదాబాద్, బెంగళూరు, డెహ్రాడూన్, గ్యాంగ్‌టక్, ముంబయి, పాట్నా సహా పలుప్రాంత్రాల్లో బ్యాంకుల మూసివేత.
అక్టోబర్ 23 : భాయ్‌దూజ్, భత్రి ద్వితీయ, చిత్రగుప్త జయంతి, లక్ష్మీపూజల నేపథ్యంలో అహ్మదాబాద్, గ్యాంగ్‌టక్, ఇంఫాల్, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, సిమ్లాలో బ్యాంకుల మూసివేత.
అక్టోబర్ 25 : నాలుగో శనివారం కారణంగా బ్యాంకుల మూసివేత
అక్టోబర్ 26 : ఆదివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
అక్టోబర్ 27 : ఛఠ్‌పూజ నేపథ్యంలో కోల్‌కతా, పట్నా, రాంచీల్లో బ్యాంకులు బంద్.
అక్టోబర్ 28 : చఠ్పూజ నేపథ్యంలో కోల్‌కతా, పాట్నా, రాంచీల్లో బ్యాంకుల మూసివేత
అక్టోబర్ 31 : సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా అహ్మదాబాద్‌లోని బ్యాంకులకు హాలీడే.
Read More :
Weather Update | అక్టోబర్‌లోనూ దంచికొట్టనున్న వర్షాలు.. వెల్లడించిన భారత వాతావరణశాఖ..