సిరిసిల్ల రూరల్, అక్టోబర్ 1: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో విజయ దశమి వేడుకలు (Dasara Celebrations) చాలా ప్రత్యేకంగా జరుగుతాయి. తంగళ్లపల్లిలోని ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తారు. ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ గుట్ట ప్రాంతంలో ఈ వేడుకలు నిర్వహించడం ఆనవాయితీ. శమీ పూజ తర్వాత సాయంత్రం వేళలో గ్రామస్తుల సమక్షంలో మహిషాసురుడి దహనం నిర్వహిస్తారు. 25 ఏండ్లుగా ప్రశాంత వాతావరణంలో దసరా వేడుకలు జరుపుకోవడం ఇక్కడ కొనసాగుతుంది. ఈసారి 20 అడుగుల మహిషాసురుడి కటౌట్ దహనం చేస్తున్నట్లు ఫ్రెండ్స్ క్లబ్ అధ్యక్షుడు ఎడ్మల శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఈ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న మహిళలకు విజేతలకు బహుమతుల ప్రధాన కార్యక్రమం కూడా జరుగుతుందని పేర్కొన్నారు.