పాన్‌గల్, ఆగస్టు 5 : జురాల, శ్రీశైలం డ్యాంలనుంచి పుష్కలంగా సాగునీరు వస్తున్నా, ఎంజీకేఎల్ఐ, భీమా కాల్వల ద్వారా రైతుల పంటపొలాలకు సాగునీటిని అందించడంలో ప్రభు త్వం పూర్తిగా వైఫల్యం చెందిందని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలో ని దవాజీపల్లి, మాందాపూర్, రాయినిపల్లి గ్రామాల్లోని ఎంజే-4, ఎంజే-8, ఎంజే-18, ఎంజే-19 సాగునీటి కాల్వలను మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి పరిశీలించి రైతుల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సాగునీటి విషయంలో మాజీ సీఎం కేసీఆర్ రైతులకు ఎలాంటి ఇ బ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టేవారని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం లో రైతులకు సాగునీటి తిప్పలు తప్ప డం లేదన్నారు. కాల్వల్లో పూడికతీత పనులు చేపట్టకపోవడంతో జమ్ము పచ్చి మొక్కలు పెరిగి సాగునీరు ముం దుకు వెళ్లకపోవడం లేదని, దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. స్థానిక రైతులు సంబంధిత అధికారులకు మొర పెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందని తెలిపారు. రాయినిపల్లి రైతులు సుమా రు 150ఎకరాలకుపైగా వేరుశనగ పంటలు సాగుచేసుకున్నారని, సాగునీరు అందక పంటలు ఎండిపోయే అవకాశం ఉందన్నారు.
రెండు, మూ డు రోజుల్లో పంటపొలాలకు సాగునీటిని వదలకపోతే రైతులతో కలిసి ధర్నా చేపడతామని తెలిపారు. కాల్వ ల్లో జమ్ము పెరిగిపోయి సాగునీరు ముందుకు సాగడం లేదని, తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాయినిపల్లి, తెల్లరాళ్లపల్లి గ్రామాల్లో చెక్‌డ్యాంలు ఏర్పాటు చేయడంతోపాటు సొంత ఖర్చులతో కాల్వల్లోని జమ్మును తొలగించామని తెలిపారు. మంత్రి జూపల్లి కృష్ణారావు రైతుల సమస్యలను గాలికి వదిలేయకుండా వెంటనే సాగునీటి స మస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి పాలనలో అడుగడుగునా దగాపడ్డ తెలంగాణ ప్రజలకు సాగునీటి అందించాలనే లక్ష్యంతో కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు అంకుర్పాణ చేశారని అన్నారు. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరాన్ని పండబెట్టి బనకచర్ల రూపంలో గోదావరిని తరలించేందుకు ఆంధ్రాబాబులు ఎత్తులు వేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో నిర్మించారనే అక్కసుతో కాళేశ్వరం ప్రా జెక్టుపై కాంగ్రెస్ నేతలు ఓర్వలేని కుట్ర లు చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శ్రీధర్‌రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షులు వీరసాగర్, బీఆర్ఎస్ మండల కోకన్వీనర్ తిలక్‌గౌడ్, నాయకులు చంద్రశేఖర్‌నాయక్, రాజేశ్వర్‌రెడ్డి, సుధాకర్‌యాదవ్, దశరథ్నాయుడు తదితరులు ఉనారు.