Gold Price | బంగారం (Gold), వెండి (Silver) ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. వరుసగా రెండో రోజైన శనివారం మరో ఆల్‌టైం హైకి చేరుకున్నాయి. ముఖ్యంగా వెండి ధరలు రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి. ఇవాళ ఒక్కరోజే కేజీ వెండిపై రూ.11 వేలు పెరిగి రెండున్నర లక్షలు దాటింది. శనివారం ఉదయం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.2.51 లక్షలకు చేరింది.
అటు బంగారం ధరలు కూడా పెరిగాయి. ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,43,000 పలుకుతోంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,32,410కి చేరింది. ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ నెలకొనడంతో ధరలు భారీగా పుంజుకుంటున్నాయని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది.
ఈ ఏడాది ఇప్పటి వరకు తులం బంగారం రూ.63,350 లేదా 80.24 శాతం పెరిగింది. డిసెంబర్ 31, 2024న ధర రూ.78,950గా ఉన్నది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 50.87 డాలర్లు లేదా 1.13 శాతం ఎగబాకి 4,530.42 డాలర్లు పలికింది. ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలుండటంతో మదుపరులు తమ పెట్టుబడులను సురక్షితమైన అతి విలువైన లోహాలవైపు మళ్లించడంతో వీటి ధరలు దూసుకుపోతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అలాగే ఔన్స్ వెండి తొలిసారిగా 75 డాలర్ల మార్క్‌ను దాటింది. ప్రస్తుతం ఔన్స్ వెండి 79.25 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
Also Read..
CWC Meeting | ఢిల్లీలో ఖర్గే అధ్యక్షతన సీడబ్ల్యూసీ సమావేశం.. హాజరైన శశి థరూర్
Air Pollution | ఢిల్లీలో వెరీ పూర్ కేటరిగీలో గాలి నాణ్యత.. నగరాన్ని కమ్మేసిన పొగమంచు
Pune | పట్టపగలే రెచ్చిపోయిన దొంగలు.. రెండు నిమిషాల్లో రూ.కోటి విలువైన నగలు చోరీ.. VIDEO