Indian Box Office 2025 | సంవత్సరం భారతీయ చలనచిత్ర పరిశ్రమకు అద్భుతమైన వసూళ్లను అందించింది. కేవలం సౌత్ సినిమాలే కాకుండా, బాలీవుడ్ నుంచి వచ్చిన భారీ చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద రికార్డులను సృష్టించాయి. అయితే ఈ ఏడాది వెయ్యి కోట్ల క్లబ్లో చేరిన సినిమాలతో పాటు టాప్ గ్రాసర్స్‌గా నిలిచిన సినిమాలను ఒకసారి చూసుకుంటే.
1. ధురంధర్ (Dhurandhar) – రూ. 1000 కోట్లు

Dhurandhar
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ 2025 బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. కేవలం 21 రోజుల్లోనే రూ.1000 కోట్ల మార్కును దాటి, ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా రికార్డు సృష్టించింది.
2. కాంతార: చాప్టర్ 1 (Kantara: Chapter 1) – రూ.852 కోట్లు

Kantara
రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ పిరియాడిక్ డ్రామా బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.852 కోట్లు వసూలు చేసి, కన్నడ సినిమా సత్తాను మరోసారి చాటింది.
3. ఛావా (Chhaava) – రూ.808 కోట్లు

Chaava
మరాఠా యోధుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా విక్కీ కౌశల్ నటించిన ఈ చిత్రం బాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. సుమారు రూ.808 కోట్ల వసూళ్లతో 2025 టాప్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.
4. సయ్యారా (Saiyaara) – రూ.570 కోట్లు

Saiyaara
యష్ రాజ్ ఫిలిమ్స్ నుంచి వచ్చిన ఈ రొమాంటిక్ డ్రామా ఊహించని విధంగా భారీ వసూళ్లను సాధించింది. కొత్త నటీనటులు ఉన్నప్పటికీ, కథ బలంగా ఉండటంతో రూ.570 కోట్లు రాబట్టి ‘బ్లాక్ బస్టర్’గా నిలిచింది.
5. కూలీ (Coolie) – రూ.518 కోట్లు

Coolie
సూపర్‌స్టార్ రజనీకాంత్ – లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో వచ్చిన ‘కూలీ’ విమర్శల మధ్యే బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.518 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.
6. వార్ 2 (War 2): హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 364 కోట్ల వసూళ్లను రాబట్టింది.
7. మహావతార్ నరసింహ (Mahavatar Narsimha) : యానిమేషన్ చిత్రంగా వచ్చిన ఈ చిత్రం రూ. 327 కోట్ల వసూళ్లను రాబట్టింది.
8. లోక: చాప్టర్ 1 (Lokah): మలయాళం నుంచి వచ్చిన ఈ సినిమా రూ.304 కోట్లతో సత్తా చాటడమే కాకుండా మలయాళం అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాలలో మొదటి స్థానంలో నిలిచింది.
9. OG (దే కాల్ హిమ్ OG): పవన్ కల్యాణ్ నటించిన ఈ చిత్రం దాదాపు రూ.300 కోట్లతో టాలీవుడ్లో టాప్ వసూళ్లను సాధించింది.
ఇంకా ఇవే కాకుండా హౌస్‌ఫుల్ (రూ.295 కోట్లు), ఎల్2 ఎంపురాన్ (రూ.268 కోట్లు), సితారే జమీన్ పర్ (రూ.268 కోట్లు), సంక్రాంతికి వస్తున్నాం (రూ.258 కోట్లు), గుడ్ బ్యాడ్ అగ్లీ (రూ.248 కోట్లు) వసూళ్లను సాధించాయి.