CWC Meeting | ఢిల్లీ (Delhi)లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం (CWC Meeting) ప్రారంభమైంది. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఇందిరా భవన్లో (AICC headquarters) ఈ సమావేశం జరుగుతోంది. ఈ భేటీకి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ సహా కాంగ్రెస్ ఎంపీలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవలే తెచ్చిన వీబీ జీ రామ్జీ చట్టంలోని లోపాలపై చర్చించనున్నారు. దీనిపై దేశవ్యాప్తంగా చేపట్టాల్సిన ఆందోళనలపై కార్యాచరణ ఖరారు చేయనున్నారు.
#WATCH | Delhi | Congress Working Committee (CWC) meeting ongoing at the All India Congress Committee (AICC) Headquarters in Indira Bhawan. pic.twitter.com/poDXmcfouT
— ANI (@ANI) December 27, 2025
ఇక ఈ సమావేశానికి పార్టీ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ (Shashi Tharoor) కూడా హాజరయ్యారు. గత కొన్ని రోజులుగా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ, కీలక సమావేశాలకు కూడా గైర్హాజరవుతూ ఉన్నారు థరూర్. అయితే, ఇప్పుడు అనూహ్యంగా సీడబ్ల్యూసీ సమావేశానికి థరూర్ హాజరుకావడం ఆసక్తికరంగా మారింది.
#WATCH | Delhi | Congress MP Shashi Tharoor arrives at the All India Congress Committee (AICC) Headquarters in Indira Bhawan to attend the Congress Working Committee (CWC) meeting. pic.twitter.com/SKZhFmgwyz
— ANI (@ANI) December 27, 2025
Also Read..
Air Pollution | ఢిల్లీలో వెరీ పూర్ కేటరిగీలో గాలి నాణ్యత.. నగరాన్ని కమ్మేసిన పొగమంచు
Pune | పట్టపగలే రెచ్చిపోయిన దొంగలు.. రెండు నిమిషాల్లో రూ.కోటి విలువైన నగలు చోరీ.. VIDEO
Wild Boar Attack: ఫారెస్ట్ ఆఫీసర్పై దాడి చేసిన అడవిపంది.. ఇక ఏం జరిగిందో చూడండి.. వీడియో