Air Pollution | దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం (Air Pollution) తీవ్రంగా ఉంది. ఏక్యూఐ లెవెల్స్ రోజురోజుకూ ప్రమాదకరస్థాయిలోనే నమోదవుతున్నాయి. తాజాగా శనివారం ఉదయం కూడా ఢిల్లీలో వాయు కాలుష్యం వెరీ పూర్ కేటగిరీలో నమోదైంది. నగరంలో ఇవాళ ఓవరాల్ ఏక్యూఐ లెవెల్స్ 355గా నమోదయ్యాయి. నగరాన్ని ప్రమాదకరమైన పొగమంచు కమ్మేసింది.
సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (Central Pollution Control Board) ప్రకారం.. నగరంలో ఉదయం 9 గంటల సమయానికి గాలి నాణ్యత సూచిక 355గా నమోదైంది. కొన్ని ప్రాంతాల్లో 400కిపైగా నమోదయ్యాయి. ఆనంద్ విహార్లో 410, జహన్గిరిపురిలో 414, నరేలా ప్రాంతంలో 406, రోహిణి ప్రాంతంలో 406, షాదిపూర్ ప్రాంతంలో 408గా ఏక్యూఐ నమోదైంది. వీటితోపాటూ పలు ప్రాంతాల్లోనూ గాలి నాణ్యత అధ్వానస్థాయిలో నమోదైంది. దీనికితోడు నగరాన్ని దట్టమైన పొగమంచు కమ్మేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మరోవైపు రాజధాని ప్రాంతంలో తీవ్ర కాలుష్యంపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ (CJI Surya Kant) ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ కాలుష్య సంక్షోభానికి పర్యావరణ నిపుణులు సమర్థవంతమైన పరిష్కారాన్ని కొనుగొంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. ‘ఢిల్లీని పీడిస్తున్న వాయు కాలుష్య సమస్యను నివారించడానికి స్వల్పకాలిక ఉపశమనం కలిగించే విధానాల కంటే.. దీర్ఘకాలిక పరిష్కారం కోసం చర్యలు అవసరం. ప్రజారోగ్యానికి పెద్ద సవాలుగా మారుతున్న ఈ వాయు కాలుష్య సమస్యకు నిపుణులు పరిష్కారం కనుగొంటారని నాకు నమ్మకం ఉంది’ అని అన్నారు.
Also Read..
PM Modi: ధైర్యం, కరుణ, త్యాగాలకు గురు గోవింద్ సింగ్ ప్రతిరూపం: ప్రధాని మోదీ
Pune | పట్టపగలే రెచ్చిపోయిన దొంగలు.. రెండు నిమిషాల్లో రూ.కోటి విలువైన నగలు చోరీ.. VIDEO
Wild Boar Attack: ఫారెస్ట్ ఆఫీసర్పై దాడి చేసిన అడవిపంది.. ఇక ఏం జరిగిందో చూడండి.. వీడియో