PM Modi: ధైర్యం, కరుణ, త్యాగాలకు గురు గోవింద్ సింగ్ ప్రతిరూపం: ప్రధాని మోదీ
PM Modi: ధైర్యం, కరుణ, త్యాగాలకు గురు గోవింద్ సింగ్ ప్రతిరూపంగా నిలుస్తారని ప్రధాని మోదీ అన్నారు. సత్యం, న్యాయం, ధర్మం వైపు నిలబడేందుకు గురుగోబింద్ జీవితం, బోధనలు ప్రేరణ కలిస్తాయని ప్రధాని తెలిపారు.
న్యూఢిల్లీ: ధైర్యం, కరుణ, త్యాగాలకు గురు గోవింద్ సింగ్ ప్రతిరూపంగా నిలుస్తారని ప్రధాని మోదీ(PM Modi) అన్నారు. మానవుల మనుగడను కాపాడేందుకు.. సత్యం, న్యాయం, ధర్మం వైపు నిలబడేందుకు గురుగోబింద్ జీవితం, బోధనలు ప్రేరణ కలిస్తాయని ప్రధాని తెలిపారు. పదవ సిక్కు మత గురువు గురు గోబింద్ సింగ్ విజన్ ఇప్పటికీ అనేక మందిని సేవ, నిస్వార్ధ కర్తవ్యం దిశగా నడుపుతుందన్నారు. గురు గోబింద్ సింగ్ జీ పవిత్రమైన ప్రకాశ్ ఉత్సవ్ నేపథ్యంలో ప్రధాని మోదీ ఇవాళ తన సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్‌లో కొన్ని ఫోటోలను షేర్ చేశారు. గురుగోబింద్కు వినమ్రంగా నమస్కరిస్తున్నట్లు చెప్పారు.
ఈ ఏడాది పాట్నాలోని తకత్ శ్రీ హరిమందిర్ పాట్నా సాహిబ్ వెళ్లిన ఫోటోలను ఆయన పోస్టు చేశారు. గురుగోబింద్కు చెందిన పవిత్ర పాదరక్షకులు జోరే సాహిబ్‌ను దర్శించుకున్నట్లు కూడా మోదీ చెప్పారు. గురుగోబింద్ సింగ్ కుమారులు సాహిబ్జాదే బాబా జోరావార్ సింగ్, బాబా ఫతే సింగ్ అమరులైనారని, వారిని స్మరించేందుకు డిసెంబర్ 28వ తేదీన వీర్ బాల్ దివస్‌ను సెలబ్రేట్ చేస్తున్నట్లు గతంలో మోదీ చెప్పారు. అయితే వీర్ బాల్ దివస్ సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలను ఆర్గనైజ్ చేస్తున్నారు. షాహిబ్జాదాల ధైర్యసాహసాల గురించి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. గురు గోబింద్ సింగ్ కుమారులైన సాహిబ్జాదీలు భారతీయుల గుండె ధైర్యాన్ని, సాహసాన్ని ప్రదర్శించి.. క్రూరమైన మొఘల్ సుల్తాన్లను మట్టికరిపించినట్లు శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ చెప్పారు.
On the sacred Parkash Utsav of Sri Guru Gobind Singh Ji, we bow in reverence to him. He remains an embodiment of courage, compassion and sacrifice. His life and teachings inspire us to stand for truth, justice, righteousness and to protect human dignity. Sri Guru Gobind Singh… pic.twitter.com/QfudU2di3U
— Narendra Modi (@narendramodi) December 27, 2025
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కుంభకోణాల కుంభమేళా.. సింగరేణిలో కాంగ్రెస్ స్కాముల గోల : కేటీఆర్ సింహ గర్జన
మూడు గంటల పటాటోపం.. ప్రారంభించిన కొద్దిసేపటికే ‘పాలమూరు’ పంపులు బంద్
బలిపీఠంపై కార్మిక బోర్డు.. స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసేలా ప్రభుత్వం ప్లాన్
జై కొట్టిన సింగరేణి
హైదరాబాదుడులో భారత్ బోల్తా.. ఉప్పల్ టీ20లో వెస్టిండీస్‌దే విజయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

