KTR | రేవంత్రెడ్డి మరో సోదరుడు జగదీష్ రెడ్డి ఎంవోయూ సంగతేంటో..? : కేటీఆర్
KTR | రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డికి రేవంత్ సర్కార్, మోదీ సర్కార్ కలిసి రూ.1137 కోట్ల అమృత్ కాంట్రాక్టులు ఇస్తున్నారు. అట్లాగే రేవంత్ సర్కార్, మోదీ సర్కార్ కలిసి నడుపుతున్న సింగరేణిలో సృజన్ రెడ్డి కనుసన్నల్లోనే మొత్తం నడుస్తోందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ . .
KTR | అనుముల జగదీష్ రెడ్డి అని రేవంత్ రెడ్డికి మరో సోదరుడున్నారు. ఆయన అమెరికాలో ఉంటరు. రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు పోతే.. జగదీష్ రెడ్డి, రేవంత్రెడ్డి ఇద్దరు అన్నదమ్ములు కలిసి స్వచ్ బయో అనే కంపెనీతో రూ.1000 కోట్లకు ఎంవోయూ (Memorandum of understanding) చేసుకున్నారని ఒక ఫొటో దిగారు. మరి అదేమైందో..? వాళ్లకు కూడా భూమి ఎక్కడో ఇచ్చాడో అది కూడా తవ్వి తీయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
ఈ విషయమై కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డికి రేవంత్ సర్కార్, మోదీ సర్కార్ కలిసి రూ.1137 కోట్ల అమృత్ కాంట్రాక్టులు ఇస్తున్నారు. అట్లాగే రేవంత్ సర్కార్, మోదీ సర్కార్ కలిసి నడుపుతున్న సింగరేణిలో సృజన్ రెడ్డి కనుసన్నల్లోనే మొత్తం నడుస్తోందన్నారు. సైట్ విజిటేషన్ సర్టిఫికెట్లు వేల కోట్ల కుంభకోణాలు..ఇవన్నీ గతంలో బయటపెట్టాం. మళ్లీ చెప్పమంటే మళ్లీ చెప్తాం. సైట్ విజిటేషన్ సర్టిఫికెట్లు అనే నిబంధనలు అడ్డం పెట్టి ఏరకంగా చేస్తున్నారు.
తాజాగా మా తమ్ముడు మన్నె క్రిశాంక్ వెలుగులోకి తీసుకొచ్చింది అనుముల కొండల్ రెడ్డి టెసరాక్ట్ అనే కంపెనీ బాగోతం. కంపెనీకి ఒక్క ఉద్యోగి లేడు.. రూపాయి ఆదాయం లేదు. రూ.లక్ష మూలధనం.. ఆఫీస్ అడ్రస్ లేదు.. కానీ వడ్డించే వాడు మనవాడైతే ఎక్కడ కూర్చుంటే ఏముంది..? ఇవాళ రూ.200 కోట్ల విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని గజం 3700 రూపాయల చొప్పున కేవలం రూ.7 కోట్లకు కొండల్రెడ్డికి అన్నగారు రాసిచ్చాడు. మరి ఇది స్కామా.. కాదా..? పక్క రాష్ట్రం కర్ణాటకలో ముఖ్యమంత్రి సతీమణికి ఆనాడు 3 ఎకరాల స్థలం ఇస్తేనే ఆ ముఖ్యమంత్రి రాజీనామా చేసే పరిస్థితి వచ్చింది. తప్పకుండా ఈ అంశాన్ని వదిలిపెట్టమని కేటీఆర్ హెచ్చరించారు.
రేవంత్ రెడ్డి తన మరో సోదరుడు అనుముల జగదీష్ రెడ్డితో అమెరికాలో రూ.1000 కోట్లతో స్వచ్ బయో అనే కంపెనీ పేరు మీద MOU చేసుకున్నాడు
ఈ అనుముల జగదీష్ రెడ్డికి కూడా ఎక్కడ భూమి ఇచ్చారో తవ్వి తీయాలి
మోడీ ప్రభుత్వంతో కలిసి రేవంత్ రెడ్డి తన బావమరిది సృజన్ రెడ్డికి రూ.1137 కోట్ల అమృత్… https://t.co/ECQFJc4FGo pic.twitter.com/84CPyW8tBa
— Telugu Scribe (@TeluguScribe) August 11, 2026
Read Also :
Chalivagu project | చలివాగు ప్రాజెక్టు ద్వారా రైతులకు సాగు నీరందించాలని బీఆర్ఎస్ ధర్నా
High Alert | ఢిల్లీలో ఉగ్రదాడులు జరుగవచ్చన్న ఇంటెలిజెన్స్.. అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం
Dhanush Fans | కోయంబత్తూరులో భారీ ప్లాన్.. ధనుష్ రాజకీయ అరంగేట్రంపై మళ్లీ మొదలైన చర్చ!
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

