Abhishek Porel | అత్యాచారం కేసులో ఐపీఎల్ స్టార్ అరెస్ట్..!
Abhishek Porel : ఇండియన్ ప్రీమియర్ లీగ్ స్టార్ అభిషేక్ పొరెల్ (Abhishek Porel) అరెస్టయ్యాడు. అత్యాచారం కేసులో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Abhishek Porel : ఇండియన్ ప్రీమియర్ లీగ్ స్టార్ అభిషేక్ పొరెల్ (Abhishek Porel) అరెస్టయ్యాడు. అత్యాచారం కేసులో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ వైద్య విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు అభిషేక్‌పై క్రిమినల్ కేసు పెట్టిన పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను లైంగికంగా లొంగదీసుకున్నాడని సదరు విద్యార్థిని అతడిపై తీవ్రమైన ఆరోపణలు చేసింది.
ఐపీఎల్లో మెరుస్తున్న మరో క్రికెటర్ అత్యాచారం కేసులో అరెస్టయ్యాడు. ఇప్పటికే యశ్ దయాల్ రేప్ కేసులో ఇరుక్కోగా.. బెంగాల్ క్రికెటరైన అభిషేక్ పొరెల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించే అభిషేక్ తనపై అత్యాచారం చేశాడని, భయపెట్టాడని ఓ వైద్య విద్యార్థిని ఫిర్యాదు చేయడమే అందుకు కారణం. సదరు విద్యార్థిని ఫిర్యాదు మేరకు డుమ్ డుమ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎమామి సిటీ పోలీసులు అభిషేక్‌ను అరెస్ట్ చేశారు.
News Alert! Cricketer Abhishek Porel arrested by Bengal police on rape charges: Official pic.twitter.com/QSAwfJbzM4
— Press Trust of India (@PTI_News) August 11, 2026
హుగ్లీ రూరల్ పోలీస్ ఎస్పీ కున్వర్ భుషణ్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు జూన్‌లో అభిషేక్‌పై ఫిర్యాదు చేసింది. ‘గత మూడేళ్లుగా మేము రిలేషన్షిప్లో ఉన్నాం. నన్ను పెళ్లి చేసుకుంటానని అభిషేక్ నమ్మబలికాడు. నన్ను లైంగికంగా వాడుకున్నాడు. అయితే.. పెళ్లి ప్రస్తావన తీసుకురాగా.. ముఖం చాటేశాడు. దాదాపు ఏడాది కాలంగా అతడు నన్ను దూరం పెడుతున్నాడు. పెళ్లి చేసుకోవాలని అడిగితే నన్ను బెదిరించాడు’ అని వైద్య విద్యార్ధిని ఫిర్యాదు చేసింది.
🚨 ABHISHEK POREL ARRESTED 🚨
– Finally, the speculation has turned out to be true. Delhi Capitals cricketer Abhishek Porel has been arrested.🤯
– A woman had filed a complaint against him a few days ago, and according to reports, he has been arrested today in connection with… pic.twitter.com/8jmfhoc5iA
— lndian Sports Network (@IS_Netwrk29) August 11, 2026
తనకు న్యాయం చేయాలని ఆమె కోర్టును కూడా ఆశ్రయించింది. దాంతో, కోల్‌కతా హైకోర్టు క్రికెటర్ అభిషేక్‌ను అరెస్ట్ చేయాలని ఆదేశాలిచ్చింది. అయితే.. అభిషేక్ మాత్రం తనకేం తెలియదని, ఆ అమ్మాయి చెబుతున్నదంతా కట్టు కథ అని కొట్టిపారేశాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mini Cooper | ‘అన్నీ మా డాడి చూసుకుంటాడు’.. ముగ్గురి మృతికి కారణమైన యువకుడి తలపొగరు వ్యాఖ్య..?
Bhagavan Das | భగవాన్ దాస్ ఆశయాలు నేటికీ చిరస్మరణీయం : దాస్యం వినయ్ భాస్కర్
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

