మెల్బోర్న్: ఆస్ట్రేలియా గడ్డపై ఆ దేశాన్నే ఓడించింది ఇంగ్లండ్. సుమారు 14 ఏళ్ల విరామం తర్వాత ఆసీస్ పిచ్‌పై టెస్టుల్లో ఇంగ్లండ్ జట్టు విజయం((England Win) సాధించింది. మెల్బోర్న్లో జరిగిన నాలుగో టెస్టులో ఇంగ్లండ్ నాలుగు వికెట్ల తేడాతో అసాధారణ విజయాన్ని నమోదు చేసింది. కేవలం రెండు రోజుల్లోనే బాక్సింగ్ డే మ్యాచ్ ముగియడం గమనార్హం. ఆసీస్, ఇంగ్లండ్ మధ్య జరిగిన పెర్త్ టెస్టు కూడా రెండు రోజుల్లో ముగిసిన విషయం తెలిసిందే. అయితే పెర్త్ టెస్టులో ఆస్ట్రేలియా విక్టరీ కొట్టగా, ఇవాళ మెల్బోర్న్లో ఇంగ్లండ్ స్వీట్ విక్టరీ నమోదు చేసింది.
రెండో ఇన్నింగ్స్‌లో 175 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకున్నది. వాస్తవానికి ఈ మ్యాచ్ కూడా హోరాహోరీగా సాగింది. ఆస్ట్రేలియా బౌలర్లు ఇంగ్లండ్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టారు. టార్గెట్ చిన్నదే అయినా..ఇంగ్లండ్ క్రికెటర్లు తెగ ఇబ్బందిపడాల్సి వచ్చింది. పేస్ అటాక్‌తో ఆస్ట్రేలియా బౌలర్లు చమటలు పట్టింది. ఇవాళ రెండో రోజు ఆస్ట్రేలియా తన రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 132 రన్స్ కే ఆలౌటైంది. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రౌడన్ కార్సే 4, స్టోక్స్ 3, టాంగే రెండు వికెట్లు తీసుకున్నారు.
A drought of 5468 days is over as England win their first Test in Australia since January 2011 😲
Details 👇https://t.co/AibCWeIFBE
— ICC (@ICC) December 27, 2025
నిజానికి యాషెస్ సిరీస్‌ను ఇప్పటికే ఆస్ట్రేలియా సొంతం చేసుకున్నది. కానీ ప్రస్తుతం ఆధిపత్యాన్ని 3-1కి తగ్గించింది ఇంగ్లండ్. ఆస్ట్రేలియా తన స్వంత గడ్డపై ఓడించేందుకు ఇంగ్లండ్‌కు 15 ఏళ్లు పట్టింది. ఇన్నేళ్లలో ఇంగ్లండ్ 16 టెస్టుల్లో ఓడగా, రెండు మ్యాచ్‌లను డ్రా చేసుకున్నది. రెండు రోజుల్లోనే ముగిసిన పెర్త్ టెస్టులో మొత్తం 847 బంతులు వేయగా, ఇక మెల్బోర్న్ టెస్టులో 852 బాల్స్ పడ్డాయి. 2011లో సిడ్నీలో జరిగిన టెస్టులో చివరిసారి ఇంగ్లండ్ విజయం సాధించింది.
మెల్బోర్న్ పిచ్‌పై విమర్శలు వస్తున్నాయి. తొలి రోజే ఆ పిచ్‌పై 20 వికెట్లు కూలాయి. ఇక రెండో రోజు కూడా 16 వికెట్లు పడ్డాయి. దీంతో పిచ్‌ను మేనేజ్ చేస్తున్న తీరును విమర్శిస్తున్నారు.