హుజూరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం వచ్చిన ఏడేండ్లలో కేసీఆర్ ప్రాజెక్టులు తెచ్చిండు. పంటలు మంచిగా పండు తున్నాయి. నీళ్లు పుష్కలంగా వస్తున్నాయి. కేసీఆర్ వచ్చినంకనే తెలంగాణ సశ్యశ్యామలంగా ఉంది. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కేసీఆర్. మా ఎస్సీలకోసం కేసీఆర్ దళితబంధు ప్రకటించిన దేవుడు. వెనుకబడిన దళితుల కోసం దళిత బంధు పేరుతో ఇప్పటికే పదిలక్షలు ఇచ్చిండు. పెన్షన్లు 200 ఉన్నవి వెయ్యి జేసిండు. వెయ్యిని రెండువేలు జేసిండు. కేసీఆర్ నిజంగా దేవుడు. ఆయన అనుకున్నది సాధిస్తాడు. తెలంగాణను ముందుకు తీసుకెళ్తరు.
ప్రతిపక్షాలు ఆయనను అనరాని మాటలంటున్నారు. కానీ అది పద్దతికాదు. అది మార్చుకోవాలి. అనవసరంగా ఉండలేక, తినలేక ఆయనమీద పన్నాగం కట్టి మీరే దోచుకుని మీరే భయటకు వెళ్లారు. ఈటల రాజేందర్ ఏడేండ్లలో మూడుసార్లు గెలిచిండు.కేసీఆర్ పెద్ద కొడుకు లెక్క ఆర్థికమంత్రిని చేసిండు. కానీ ఆయన తెలంగాణకు ఏం చేసిండు.
కేసీఆర్ ఏం చేయలేదని, అల్లుడు, కొడుకు, ఆయన కలిసి దోచుకుంటున్నారని ఈటల అంటండు. కానీ కేసీఆర్ నాడు 27 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే అందులో సగం మంది వేరేపార్టీలోకి పోయినా ఆయన వెనుకడుగు వేయకుండా తెలంగాణ ఉద్యమాన్ని నడిపి తెలంగాణ సాధించిండు. ఆయనను ఒక్కమాట అనే హక్కు ఈటలకు లేదు. కచ్చితంగా మాకు మంచి చేసే టీఆర్ఎస్నే గెలిపించుకుంటం.
-గురుకుంట్ల రాజీరు, మల్యాల, ఇల్లందకుంట మండలం
రైతుబంధు వస్తుంది
మాకు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతే రైతుబంధు వస్తుంది. మా నాన్నకు పెన్షన్ వస్తుంది. కేసీఆర్ వచ్చినంకనే చాలా పనులు చేసిండు. అందుకే ఆయనకే ఓటేసి గెలిపిస్తం.
-పోరండ్ల రవీందర్, మల్యాల, ఇల్లంతకుంట మండలం
ప్రభుత్వానికి అండగా ఉంటం
మా ఇల్లు పాతది. వర్షాలకు గోడల నుంచి వాటర్ వస్తది. సందుల నుంచి నీళ్లు వస్తయి. మొన్న వర్షాలప్పుడు మా కౌన్సిలర్ సార్ డబ్బులు ఇప్పించిండు. అంతకు ముందు ఇట్ల ఎవరూ సాయం చేయలేదు. దళితబంధు వచ్చినట్టు మెసేజ్ వచ్చింది. దళితబంధుతో మా ఆయనకు కారు డ్రైవింగ్ వస్తది, హార్డ్వేర్ షాప్, సౌండ్ అండ్ డెకరేషన్ కానీ, సూపర్ మార్కెట్ గానీ పెట్టుకుంటాం. ప్రభుత్వం ఇట్లనే మాకు సహకరిస్తే నేను వందమందికి చెప్తా. తప్పకుండా ప్రభుత్వానికి అండగా ఉంటం.
-మొలుగూరి స్రవంతి, గాంధీనగర్ హుజురాబాద్ టౌన్