హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో డిసెంబర్ 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ 2047 ఉ త్సవాలను భారీ స్థాయి లో నిర్వహించనున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార తెలిపారు. బేగంపేటలోని ఓ ప్రైవేటు హోటల్లో మంగళవారం నిర్వహించిన బ్యాంకర్స్ 47వ త్రైమాసిక సమావేశంలో ఆయన మాట్లాడారు.
అన్ని రకాల పాలసీలను ప్రకటిస్తామని, ఆ వేడుకల్లో బ్యాంక ర్లు భాగస్వాములు కావాలని కోరారు. 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా 2047 రోడ్ మ్యాప్‌ను విడుదల చేస్తామన్నారు.