Telangana : తెలంగాణలో పోటీపరీక్షలకు సిద్ధమై గ్రూప్స్ కొలువు కొట్టినవాళ్లకు భారీ షాకింగ్ న్యూస్. పదేళ్ల క్రితం నిర్వహించిన గ్రూప్ -2 పరీక్ష (Group-2)ను మంగళవారం హైకోర్టు రద్దు చేసింది. 2015-16 లో నిర్వహించిన గ్రూప్ -2 పరీక్షను రద్దు చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. పిటిషనర్ల వాదనలు విన్న న్యాయమూర్తి నగేష్ భీమపాక (Nagesh Bheemapaka).. పరీక్ష విషయంలో హైకోర్టు ఆదేశాలను తెలంగాణ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ (TGPSC) ఉల్లంఘించిందని తెలిపారు.
అంతేకాదు టీజీపీఎస్సీ తన పరిధి దాటి వ్యవహరించిందని పేర్కొన్న న్యాయమూర్తి.. పునర్మూల్యంకనం చేయాలని బోర్డును ఆదేశించారు. ఆ తర్వాతే అర్హుల జాబితా ప్రకటించాలని స్పష్టం చేశారు. 8 వారాల్లోగా పునర్మూల్యంకనం, జాబితా ప్రకటన ప్రక్రియ ముగించాలని టీజీపీఎస్సీకి జడ్జి సూచించారు.
పదేళ్ల క్రితం అంటే.. 2015-16లో 439 పోస్ట్‌లకు గ్రూప్ 2 పరీక్ష నిర్వహించిన టీజీపీఎస్సీ.. 2016 నవంబర్‌లో రాత పరీక్షలు జరిపింది. అయితే.. ఈ ఎగ్జామ్‌లో కొందరు వైట్నర్ ఉపయోగించార కొందరు అభ్యంతరం తెలుపుతూ హైకోర్టును ఆశ్రయించారు. అయినా సరే టీజీపీఎస్సీ వెనక్కి తగ్గకుండా.. 2019లో నియామకాలు చేపట్టింది. నియామకాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. వైట్నర్, దిద్దుబాటు ఉన్న ప్రశ్నప్రత్రాలను మూల్యంకనం చేయడంపై అత్యున్నత ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. అలానే ట్యాంపరింగ్ జరిగినట్టు తెలిసినా సరే మూల్యంకనం చేయడం చట్టవిరుద్దమైని హైకోర్టు వెల్లడించింది. అందుకని సాంకేతిక కమిటీ సూచన ప్రకారం అప్పటి ప్రశ్నపత్రాలను తిరిగి మూల్యంకనం చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
మొత్తం పోస్ట్‌లు – 439.
అప్లికేషన్లకు గడువు – 2025 డిసెంబర్ 31 నుంచి 2016 ఫిబ్రవరి 9 వరకూ.
పరీక్షల తేదీలు – 2016 ఏప్రిల్ 24, ఏప్రిల్ 25.
ప్రధాన పోస్ట్‌లు – ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ -220
అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ – 110
ఎక్స్టెన్షన్ ఆఫీసర్ – 67
సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ -2 పోస్ట్‌లు- 23
మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-3 పోస్ట్‌లు -19
వీటితో పాటు డిప్యూటీ తహసిల్దార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-1, టెక్నికల్ గ్రేడ్-2(హెచ్ఎండబ్ల్యూ, ఎస్బీ), డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్) (హెచ్ఎండబ్ల్యూ, ఎస్బీ).