జమ్మికుంట: టీఆర్ఎస్ పార్టీతోనే సంక్షేమం సాధ్యమని హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు. జమ్మికుంట మండలంలోని మాచనపల్లి గ్రామంలో ఆ మండల ఇన్చార్జి, ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌తో కలిసి మంగళవారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. డప్పు చప్పుళ్లు, మంగళహారతులు, కోలాటాలతో గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌కు ఆడబిడ్డలు వీరతిలకం దిద్దారు.
ఈ సందర్భంగా గెల్లు శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ, తాను హుజూరాబాద్ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని చెప్పారు. కారు గుర్తుకు ఓటేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పాడి కౌశిక్‌రెడ్డి, రావుల శ్రీధర్‌రెడ్డి, జడ్పీటీసీ శ్రీరాంశ్యాం, ఎంపీటీసీ పోల్సాని రాజేశ్వరరావు, సర్పంచ్ బొజ్జం కల్పన తిరుపతిరెడ్డి, ఉపసర్పంచ్ వీ శ్రీకాంత్, గ్రామశాఖ అధ్యక్షుడు బీ ఎర్రయ్య, మర్రిపల్లి రాజయ్య, కార్యకర్తలు, అనుబంధ సంఘాల నాయకులు, మహిళలు యువత, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.