హుజురాబాద్: ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమపథకాలు కొనసాగాలంటే టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ గెలవాలని రాజ్యసభ సభ్యుడు బండప్రకాశ్ అన్నారు. బుధవారం మంత్రి శ్రీనివాసగౌడ్‌తో కలిసి ఆయన హుజురాబాద్‌లో విలేకరుతో మాట్లాడారు.
అభివృద్ధికి అండగా ఉండాలె : రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాశ్
ముదిరాజ్‌లు ఆర్థికంగా ఎదిగేందుకు టీఆర్ఎస్ సర్కారు చేయూతనిస్తున్నది. చేపపిల్లలను ఉచితంగా పంపిణీ చేస్తున్నది. 60 వేల ద్విచక్రవాహనాలు, 70 శాతం సబ్సిడీతో ట్రక్కులు అందించింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏ వర్గానికి కూడా మేలు చేయలేదు. కనీసం బీసీ గణన చేయాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదు.
ఈటల రాజేందర్ తన ప్రచారంలో ఒక్కసారి కూడా అభివృద్ధి చేస్తా అని చెప్తలేడు. ఎంతసేపూ వాళ్ల వీళ్ల మీద పడి ఏడుస్తున్నడు. రేపు ఏం చేస్తడో కూడా చెప్పడం లేదు. అభివృద్ధి చేసే సీఎం కేసీఆర్‌కు ప్రజలంతా అండగా ఉండాలె. కారు గుర్తుకు ఓటేయాలె.
ధరలు పెంచుతున్నందుకా..? : మాజీ మంత్రి ఎల్ రమణ
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను విపరీతంగా పెంచుతున్నది. ప్రజలపై మోయలేని భారం మోపుతున్నది. ఇలా ధరలు పెంచుతున్నందుకా బీజేపీకి ఓటేయాలని అడుగుతున్నవ్ ఈటల? కేంద్రంలో అధికారంలో ఉన్న మీపార్టీ వాళ్లతో మాట్లాడి ధరలు తగ్గించవచ్చుకదా? కానీ ఒక్క మాట మాట్లాడుతలేవు.
ఎప్పుడూ టీఆర్ఎస్ను విమర్శించడమే తప్ప ఏనాడైనా నువ్వేం చేస్తావో చెప్పావా..? ప్రజలు నీ మోసపూరిత మాటలు నమ్మరు. కారు గుర్తుకు ఓటేసి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను గెలిపిస్తరు.