వడ్డెపల్లి : గద్వాల జిల్లా వడ్డెపల్లి గ్రామంలో ( Vaddepalli Village ) 30 ఏళ్లుగా తాను ఎవరో తనకే తెలియకుండా, మతిస్థిమితం సరిగా లేని వృద్ధ బ్రాహ్మణుడు ( Brahmin ) మృతి చెందాడు. పేరు కూడా తెలియని బ్రాహ్మణుడికి గ్రామస్థులు అంతక్రియలు నిర్వహించారు.
ఎక్కడ నుండి వచ్చాడో ఎవరికీ తెలియదు. గ్రామాలు తిరుగుతూ గ్రామానికి చేరుకున్న బ్రాహ్మణుడికి గ్రామానికి చెందిన మాజీ వైస్ ఎంపీపీ చంద్రశేఖర్ గౌడ్ ( Chandra Shekar Goud ) , అతని సోదరుడు, పోస్టుమాస్టర్ నాగేష్ గౌడ్ ( Nagesh Goud ) ఆశ్రయం కల్పించి 30 ఏళ్లుగా తమ ఇంట్లోనే భోజనం వసతులను కల్పించారు. వృద్ధాప్యంతో శుక్రవారం రాత్రి బ్రాహ్మణుడు మృతి చెందాడు. దీంతో ఇద్దరు అన్నదమ్ములు శనివారం గ్రామంలో బ్రాహ్మణుడికి అంత్యక్రియలు నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామస్థులు తమకు తోచిన సహకారాలు అందజేశారు.
30ఏళ్లుగా బ్రాహ్మణుడికి ఆశ్రయం కల్పించిన దాతలను గ్రామస్థులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో సాటి బ్రాహ్మణులు దక్షిణామూర్తి, సత్య ప్రకాష్, రాజు, వినయ్ కౌశల్ శర్మ, రమేష్ కుమార్ అంత్యక్రియలో పాల్గొని మంత్రాలను జపించారు. బ్రాహ్మణుడు తన జీవితకాలంలో పంచతప్ప, చొక్కా కూడా ధరించక పోవడం విశేషం. నిత్యం నరసింహస్వామిని జపించే బ్రాహ్మణుడికి గ్రామస్థులు నరసింహ చార్యులుగా పిలిచి గౌరవించేవారు.